కన్న తల్లి తండ్రులు కంటే కూడా ప్రేమించి వ్యక్తి ఎంతో ముఖ్యం అయిపోతున్నాడు ఈ రోజుల్లో యువతీ యువకులకి అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా సరే ప్రేమించినప్పుడు ఎంతో పరిణితి చెంది ఉండాలి కానీ చాలా మంది ఆకర్షణకి మాత్రమే విలువ ఇచ్చి దుందుడుకు నిర్ణయాలకి తెగిస్తే మాత్రం ఈ అమ్మాయిల తనువూ చాలించడం కంటే వేరే మార్గం కనిపించదు.వివరాలలోకి వెళ్తే.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కస్‌జంగ్ ప్రాంతానికి చెందిన శివాని నోయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.ఒక అద్దె భవనంలో నివాసం ఉంటున్న ఆమె శనివారం సాయంత్రం సమయంలో ఆమె గ్రేట్ ఇండియా ప్లేస్ మాల్‌లోని మూడవ అంతస్తు నుంచి కిందకు దూకింది…ఆత్మహత్య చేసుకుంది.అయితే ఆమెని గుర్తించి హాస్పటల్ కి తీసుకు వెళ్లేలోగానే తనువూ చాలించింది.ఈ ఘటనపై మాల్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అందిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే ఘటనా స్థలంలో వారు ఒక సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.
ప్రిముడు స్పందించకపోవటం మూలానే తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు యువతి సూసైడ్ నోట్‌లో పేర్కొంది…అయితే ఆమె ఆత్మహత్య కు ముందు ఆమెని చూసిన ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.ఆమె చాలా సేపు ఎస్కలేటర్ దగ్గరలో ఫోన్ పట్టుకు కూర్చుందని, కొద్ది సేపటి తర్వాత పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు…అయితే సూసిడ్ నోట్ లో మాత్రం తన చావుకి ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ లో వెల్లడించింది.
ప్రియుడే ఆమె చనిపోవడానికి కారణం అయ్యాడా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.