జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లో వేగంగా అడుగులు వేస్తున్న కొద్దీ.ఆయనపై విమర్శలు చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది.
విమర్శలకు తట్టుకోగలిగిన వాడే బలవంతుడు అని, వాటిని పట్టించుకోనవసరం లేదని అభిమానులు, పార్టీ శ్రేణులకు చెబుతుంటారు పవన్! రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా వాటికి ఏదో ఒక సందర్భంలో బదులిచ్చేస్తుంటాడు.అయితే ప్రజా జీవితంలోకి వచ్చాక వచ్చాక రాజకీయంగానే గాక వ్యక్తిగతంగానూ ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
వీటిలో ప్రధానంగా ప్రత్యర్థులు టార్గెట్ చేసే అంశం పెళ్లిళ్లు!! ఈ విమర్శలు పవన్ వరకూ వెళ్లినా.వాటిపై అంత క్లారిటీ ఇచ్చిన దాఖలాలు ఇప్పటివరకూ కనిపించవు.
అయితే ఆయన చెప్పక పోయినా.పార్టీ తరఫున స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.
పవన్ మూడు పెళ్లిళ్లపై జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ వివరణ ఇచ్చారు.

`మూడు పెళ్లిళ్లు చేసుకున్నానో నాకు తెలుసు.ఆ బాధ మీకెలా తెలుస్తుంది` అంటూ పవన్ కల్యాణ్.ఒక బహిరంగ సభలో చెప్పిన మాటలు అటు అభిమానులతో పాటు రాజకీయ నాయకుల్లోనూ ఎన్నో సందేహాలు కలగజేశాయి.
ఇప్పటికీ పవన్‌ను వ్యక్తిగతంగా విమర్శలు చేసేవాళ్లు కూడా ఈ అంశంపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారు.ఈ నేపథ్యంలో తనను ఎక్కువగా టార్గెట్ చేసే వాళ్లకి ఏమాత్రం అవకాశమివ్వకూడదని అనుకున్నాడో ఏమోగానీ.
మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో ప్రజలకు స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.పవన్ మూడు వివాహాలు చేసుకున్నాడంటూ దానికి తమదైన కామెంట్ను జోడిస్తూ వారు విమర్శలు చేస్తుంటారు.
అయితే ఈ కామెంట్ కు తాజాగా క్లారిటీ వచ్చింది.
జనసేన పార్టీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ ఓ టీవీ చానల్ చర్చలో మాట్లాడుతూ.
భార్యతో కాపురం చేస్తూనే బయట లేడీ పార్ట్నర్స్ కలిగి ఉన్న రాజకీయ నాయకులు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారని పేర్కొంటూ అలాంటివి పవన్ కల్యాణ్ చేయడం లేదన్నారు.పవన్ మొదటి పెళ్లి విషయంలో అమ్మాయి కుటుంబం పెట్టిన షరతుల వల్లే విడిపోయారని వివరించారు.
`పవన్ మొదటి పెళ్లి చేసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు ఇల్లరికం రండి అని పవన్‌ను అడగటంతో పాటు మరికొన్ని అభిప్రాయ బేధాల వల్ల వారి వైవాహిక బంధం నిలవలేదు.వారు కలిసి ఉన్నది ఒక నెల రోజులు మాత్రమే.
` అని వివరించారు.ఇక పవన్ రెండో పెళ్లి గురించి వెల్లడిస్తూ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాతనే పవన్ మరో వివాహం చేసుకున్నారని శ్రీధర్ తెలిపారు.
అది కూడా దాదాపు పదేళ్ల పాటు ఒంటరి జీవితం గడిపిన తర్వాత అని అన్నారు.వివిధ కారణాల వల్ల వీరు విడిపోయారని.అలా అని పవన్ పై రేణుదేశాయ్ ఎలాంటి ఆరోపణలు కూడా చేయలేదని గుర్తు చేశారు.వారు ఇప్పటికీ మిత్రుల వలే ఉన్నారని తమ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని వివరించారు.
విడాకులకు వేర్వేరు కారణాలు ఉంటాయని పేర్కొంటూ వాటి విషయంలో బయటి వారికి తెలిసింది తక్కువ అని పేర్కొన్నారు.రేణుకకు కూడా విడాకులు ఇచ్చే మూడో పెళ్లి చేసుకున్నారని బదులిచ్చారు.
.