అల్లం పొట్టు తీయకుండా వాడుతున్నారా... వాడితే ఏమి జరుగుతుందో తెలుసా?

అల్లంను మనం ప్రతి రోజు వంటల్లో వాడుతూ ఉంటాం.అల్లం వంటలకు రుచిని ఇవ్వటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

 Can You Eat Ginger Peel-TeluguStop.com

అల్లంలో సోడియం,పొటాషియం, విటమిన్ A ,C,K లు, కాల్షియం, మెగ్నీషియం,ఇనుము,పీచు వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి.ఈ పోషకాలు మన శరీరంలో ఉన్న రక్తనాళాల్లో కొవ్వును కరిగించటంలో సమర్ధవంతంగా పనిచేస్తాయి.

గ్యాస్,అజీర్ణం సమస్యలతో బాధపడేవారు ఉదయం పరగడుపున నీటిలో మరిగించిన అల్లం నీటిని త్రాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.అంతేకాక శరీరంలో చెడు కొలస్ట్రాల్ ఏర్పడకుండా కాపాడుతుంది.

చాలా మంది అల్లం టీని చాలా ఇష్టంగా త్రాగుతూ ఉంటారు.అయితే అల్లంను ఉపయోగించినప్పుడు ఒక విషయాన్నీ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.అది ఏమిటంటే అల్లం పై పొట్టును తీసేసి మాత్రమే ఉపయోగించాలి.అల్లం పై పొట్టు మీద ఎన్నో క్రిమి సంహారక మందులు ఉంటాయి.

వాటి ప్రభావం మన మీద పడకుండా ఉండాలంటే అల్లం పై పొట్టు తీసేయాలి.

గ్యాస్,అసిడిటీ,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక గ్లాస్ నీటిలో కొంచెం కొత్తిమీర,నాలుగు అల్లం ముక్కలు వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి త్రాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.


దగ్గును నివారించటానికి అల్లం చాలా బాగా పనిచేస్తుంది.అల్లంలో ఉండే లక్షణాలు గొంతు ఇన్ ఫెక్షన్, గొంతు నొప్పి,అలర్జీలను తొలగించటంలో సహాయపడతాయి.ఒక స్పూన్ అల్లం రసంలో చిటికెడు ఉప్పు,అరస్పూన్ తేనే కలిపి తీసుకుంటే గొంతు ఇన్ ఫెక్షన్, గొంతు నొప్పి,అలర్జీలు తగ్గిపోతాయి.

ఈ విధంగా రోజులో రెండు నుంచి మూడు సార్లు తీసుకుంటే తొందరగా దగ్గు తగ్గిపోతుంది.

లేకపోతె అల్లంను నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని త్రాగిన మంచి ఫలితం ఉంటుంది.మనం అల్లంను కూరల్లో వేసిన,కషాయంగా త్రాగిన అల్లంను పై పొట్టు తీసి మాత్రమే ఉపయోగించాలి.

మనం ప్రతి రోజు ఎదో రూపంలో అల్లంను వాడుతూ ఉంటాం.మనం ఎంత బిజీగా ఉన్నా సరే అల్లంను పొట్టు తీసి మాత్రమే ఉపయోగించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube