ఒక మనిషి పుట్టగానే ఆ మనిషి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పటానికి చాలా మార్గాలు ఉన్నాయి.అలాంటి మార్గాలలో ఒకటి పేరులోని మొదటి అక్షరం ను బట్టి గుణగణాలను చెప్పటం.
పేరులోని మొదటి అక్షరం వారి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది.ఇప్పుడు ‘P’ అక్షరంతో పేరు మొదలయ్యే వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం
మీ పేరు ‘P ‘ అక్షరంతో మొదలు అయితే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
వీరికి దైవభక్తి ఎక్కువగా ఉండుట వలన పూజలు ఎక్కువగా చేయటమే కాకుండా తరచుగా వెళుతూ ఉంటారు.వీరు సున్నిత మనస్కులుగా ఉంటారు.
వీరిని ఎవరైనా ఏదైనా అంటే ఎక్కువగా ఫీల్ అవుతారు.అలాగే వీరిలోని శక్తిని గ్రహించలేక కంగారు పడుతూ ఉంటారు.కానీ వారు వారి శక్తిని గ్రహించి ముందడుగు వేసి విజయాలను సాధిస్తారు
వీరికి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉండుట వలన అన్ని రంగాలలోను రాణిస్తారు.వీరు ప్రతి విషయాన్నీ క్లుప్తంగా తెలుసుకోవటానికి ఇష్టపడతారు.వీరు బాగా సంపాదిస్తారు.కానీ ఖర్చు మాత్రం పెట్టరు.వీరు ఎక్కువగా భవిష్యత్ గురించి ఆలోచిస్తారు.సమస్యలు వచ్చినప్పుడు మొదట నిరుత్సాహం పొందిన ఆ తర్వాత సమస్యలను అధికమిస్తారు.
వీరిని చూడగానే అందరికి మంచి అభిప్రాయం,గౌరవం కలుగుతుంది
వీరు అందరితో స్నేహంగా ఉండాలని కోరుకుంటారు.అలాగే పెద్దలను గౌరవిస్తారు.
వీరికి ఏదైనా కష్టం వస్తే దేవుడికి చెప్పుకుంటారు.వీరి సొంత తెలివి తేటలతో ఇతరులను ఆకర్షిస్తారు.
వీరి సలహాల కారణంగా ఇతరులు లాభం పొందుతారు.వీరు వారి భాగస్వామి అభిరుచులను 85 శాతం వరకు గౌరవిస్తారు.
కానీ వీరు తల్లితండ్రుల వద్ద ఎంత వయస్సు వచ్చిన చిన్నపిల్లల వలె ఉంటారు.వీరికి తల్లితండ్రులే దైర్యం.
తల్లితండ్రులకు ఏదైనా కష్టం వస్తే అసలు తట్టుకోలేరు.వీరి నిజాయితీ,ప్రవర్తన కొన్ని సమస్యల నుండి బయట పాడేస్తుంది.