Colgate తో ఇలా చేస్తే క్షణాల్లో పెదాలు ఎర్రగా మారతాయి ..కానీ ఇలా మాత్రమే వాడాలి

అసలు colgate చర్మ సౌందర్యానికి ఉపయోగించవచ్చా? నల్లని పెదవులు ఎర్రగా మారతాయా? అన్ని చర్మ తత్వాలకు సెట్ అవుతుందా ? నల్లని పెదవులు ఎర్రగా మారటానికి ఎంత సమర్ధవంతంగా పనిచేస్తుంది? అలాగే ఎలా వాడాలి.ఎలా వాడకూడదు అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం

 Colgate Can Make Your Lips Clean???-TeluguStop.com

సాధారణంగా మనం Colgate పేస్ట్ ని పళ్ళపై పాచిని,పసుపు రంగును తొలగించటానికి ఉపయోగిస్తాం.

అయితే కొంతమంది మొటిమలను తగ్గించుకోవటానికి,మచ్చలను తొలగించటానికి Colgate వాడుతూ ఉంటారు.ముఖం మీద ఒకటి రెండు మొటిమలు వచ్చినప్పుడు Colgate వాడవచ్చు.

ఎక్కువగా మొటిమలు ఉన్నప్పుడు Colgate ని వాడకుండా ఉండటమే మంచిది.చర్మం సెన్సిటివ్ గా ఉన్నవారు Colgate ని ఉపయోగించకుండా ఉంటేనే మంచిది.

ఎందుకంటే మన శరీర చర్మంతో పోలిస్తే ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.అంతేకాకుండా Colgate పేస్ట్ లో బేకింగ్ సోడా,హైడ్రోజన్ పేరా అక్సయిడ్, మెంతాల్ వంటివి ఉంటాయి.

ఇవన్నీ చర్మాన్ని పొడిగా మారుస్తాయి.అందువల్ల పొడి చర్మం ఉన్నవారు,సెన్సిటివ్ చర్మం ఉన్నవారు Colgate ని వాడకుండా ఉంటేనే మంచిది


నార్మల్ చర్మం మరియు ఆయిలీ చర్మం వారు కొన్ని జాగ్రత్తలను తీసుకోని ముఖానికి వాడవచ్చు.ఇప్పుడు పెదాల నలుపును తొలగించటానికి Colgate పేస్ట్ ని ఎలా ఉపయోగించాలో చూద్దాం.ఈ విధంగా చేస్తే పెదాలపై మృతకణాలు,నలుపు తొలగిపోతుంది.

సున్నితమైన టూట్ బ్రష్ తీసుకోని పేస్ట్ పెట్టి పెదాలపై సున్నితంగా రెండు నిముషాలు రుద్ది కడిగేయాలి.ఇప్పుడు నిమ్మచెక్కను తీసుకోని పంచదార అద్ది పెదవులపై రెండు నిముషాలు స్క్రబ్బింగ్ చేయాలి.

ఈ విధంగా చేసిన తర్వాత సాధారణ నీటితో కడిగేయాలి

ఆ తర్వాత పెదాలకు మాయిశ్చరైజర్ రాయాలి.ఈ విధంగా చేస్తే మీ నల్లని పెదాలపై నలుపుదనం మరియు మృతకణాలు పోయి ఎర్రని పెదాలు మీ సొంతం అవుతాయి.

ఈ మూడు స్టెప్స్ చేస్తే మీ పెదాలు ఎర్రగా,మృదువుగా మారతాయి.అయితే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈ చిట్కా ఆయిలీ చర్మం, నార్మల్ చర్మం వారికీ బాగా పనిచేస్తుంది.

సెన్సిటివ్ చర్మం,పొడి చర్మం ఉన్నవారు ఈ చిట్కాను పాటించకుండా ఉంటేనే మంచిది.ఎందుకంటే సెన్సిటివ్ చర్మం,పొడి చర్మం ఉన్నవారు Colgate వాడితే చర్మం ఇంకా పొడిగా మారిపోతుంది.

కాబట్టి ఆయిలీ చర్మం, నార్మల్ చర్మం ఉన్నవారు ఈ చిట్కాను ఉపయోగించి ఎర్రటి పెదాలను సొంతం చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube