బాబును న‌మ్మేది ఎలా....

`ప్ర‌త్యేక‌హోదా సాధిస్తా.హోదానే సంజీవ‌ని.

 How To Believe Ap Cm Chandrababu..?-TeluguStop.com

ఇది విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఏపీకి ఇది వ‌రప్ర‌దాయిని` అని ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు చెప్పారు.స‌రిగ్గా రెండున్న‌రేళ్లు గ‌డిచాయి.

కాలంతో పాటు హోదాపై బాబు మాట కూడా మారిపోయింది.హోదానే సంజీవని అన్న బాబు.

హోదా ఏమీ సంజీవ‌ని కాదు.స‌మ‌స్య‌ల‌న్నీ తీరిపోవ‌డానికి అన్నారు.

హోదాతో ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయ‌న్న వారే.ప్యాకేజీతో రాష్ట్రాభివృద్ధి అంటున్నారు.

ఇప్పుడు హోదా కోసం పోరాడే వాళ్ల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు! మ‌రి 2019లో బాబును న‌మ్మేదెలా? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

`మీరెవరు ఏమీ చెయ్యొద్దు…నన్ను నమ్మండి……నా పైన నమ్మకం ఉంచండి….నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా…మీ జీవితాలను బాగు చేస్తా` అనే రేంజ్‌లో మాట్లాడేస్తున్నారు చంద్ర‌బాబు.2014లో రాష్ట్రానికి హోదా తెస్తాన‌ని చెప్పిన బాబు మాట‌ల‌ను న‌మ్మిన జ‌నం.ఓట్లేసి అంద‌ల‌మెక్కించారు.సగం పదవీ కాలం పూర్తయ్యే టైంకి అంతా ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది.పవర్‌లోకి రాగానే ప్రత్యేక హోదా ప్రాధాన్యాన్ని తగ్గించి చెప్పడం స్టార్ట్ చేసింది చంద్రబాబే.ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా గురించి గంటలు గంటలు మాట్లాడిన బాబుకి ఇప్పుడు ప్రత్యేక హోదా ప్రాధాన్యత ఏంటో చెప్పేవాళ్ళు కావాలంటున్నారు.

హోదా కాద‌ని ఇప్పుడు ప్యాకేజీ ప్ర‌క‌టించారు.ఇక పోల‌వరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి రెండువేల కోట్లు ఇచ్చారు.

ఇక అదే మ‌హా ప్రసాదంగా బాబు స్వీక‌రించారు.మ‌రి ఇప్పుడు చేస్తున్న స్పీడ్‌తోనే పనులు జరుగుతూ ఉంటే రాజధాని నిర్మాణం ఎప్పటికి పూర్తయ్యేను? లక్షల కోట్లు పెట్టుబడుల ఒప్పందాలు అని మాటలు చెప్పడమే తప్ప చేతలేవి? అన్నింటికీ మించి బాబును మోడీ పట్టించుకోవడ‌మే మానేశారు.మ‌రి ఇటువంటి స‌మ‌యంలో బాబును నమ్మి ఇంకో రెండేళ్ళు కూడా ఎదురు చూస్తే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మిగిలేదేంటి?

రెండున్నరేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబును నమ్ముతూనే ఉన్నారు.ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల పోరాట సామర్థ్యాన్ని బాబు నమ్మాల్సిన టైం వచ్చింది.

ఈ రెండున్నరేళ్ళుగా బాబు, మోడీ, వెంకయ్య మాటలు వింటున్నవాళ్ళకు ….ఇప్పుడిక ఆ మాటలపైన విశ్వాసం కలిగే అవ‌కాశ‌మే లేద‌ని తెలుస్తోంది, ప్రజలను నమ్మి కేంద్ర ప్రభుత్వంపైన పోరాటానికి సిద్ధపడడమా? లేక నన్ను నమ్మి సైలెంట్‌గా ఉండడమా అన్న విషయం బాబే తేల్చుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube