పాశ్చాత్య సంస్కృతి నుంచి మనదేశంలోని బడా కుటుంబాల అమ్మాయిలకు అంటుకుంది బికిని సంస్కృతి.మన దేశంలో బిచ్ లు తక్కువే అనుకోండి.
అయినా, బాలివుడ్ హీరోయిన్లు బికిని వేయడం మొదలుపెట్టాక ట్రెండిగా ఉండే అమ్మాయిలంతా బికినికి బాగా అలావాటు పడిపోయారు.బికిని అనేది ఒక సెక్సి సింబల్.
అందుకే సినిమాల్లో ఒక కమర్షియల్ ఎలిమెంట్ అయిపోయింది.మనదేశంలో చూస్తే, గోవాలో బికిని సంస్కృతి ఎక్కువగా కనిపిస్తుంది.
మరి ఈ బికినిపై భారతీయ అమ్మాయిల స్పందన ఏంటి? బికిని నిజంగానే సౌకర్యవంతంగా ఉంటుందా? అసలు అమ్మాయిలు బికిని ఎందుకు వేస్తారు? ఇలాంటి ప్రశ్నలన్ని ఒక యూట్యూబ్ ఛానెల్ మనదేశంలోని మహానగరాల అమ్మాయిలను అడిగింది.సమాధానాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
బికిని వేసుకోవడం తప్పు అస్సలు కాదని భావిస్తున్నారు మహానగరాల్లోని అమ్మాయిలు.కాని బికిని భారతదేశంలో వేసుకోవడం కష్టమైన విషయమే అని, బికినిని ఇంకా మనవాళ్ళు క్యాజువల్ గా తీసుకోవడం మొదలుపెట్టలేదని చెప్పారు అమ్మాయిలు.
ఇక బికిని వేసుకోవడానికి కారణం ఏంటంటే, సెక్సిగా కనిపించడానికి అంట.బికిని వేసుకునే శరీరాకృతి ఉండాలే కాని, బికిని లుక్స్ ని ఆకర్షణీయంగా మారుస్తుందని, సెక్సిగా ఫీల్ అవుతూ, సెక్సిగా కనిపించవచ్చు అని చెప్పుకొచ్చారు మన సిటీ గర్ల్స్.
ఇక బికిని వేసుకోవడం సౌకర్యవంతంగా ఉంటుందా లేదా అనే విషయానికి స్పందిస్తూ, అది ప్రదేశాన్ని బట్టి మారుతుందని, బికిని కల్చర్ ఉన్నచోట బికిని వేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదని, కాని కొందరు కామంతో రగిలిపోతూ తదేకంగా చూస్తారు, అలాంటప్పుడు అసౌకర్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు సర్వేలో పాల్గొన్న అమ్మాయిలు.