ఏపీ ని భారత దేశ రాష్ట్రాలు అన్నిట్లో నెంబర్ వన్ గా నిలుపుతాను అని చంద్రబాబు ఎప్పుడూ చెబుతూ ఉంటారు.హైదరాబాద్ అభివృద్ధి కి తానే ప్రధాన కారకుడిని అని చెప్పుకునే చంద్రబాబు ఇన్వెస్ట్మెంట్ లు తేవడం దగ్గర నుంచీ అమరావతి గొప్పతనం వరకూ వివిధ ఇబ్బందులు పడుతూ ఉంటారు.
దేశం లోని ముఖ్యమంత్రులలో ఐదవ రాంక్ పొందారు చంద్రబాబు.ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రానికి చేసిన మంచి గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి స్వయంగా ఇచ్చిన ఈ ర్యాంక్ లలో చంద్రబాబు కి ఐదవ స్థానం వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రతీ రాష్ట్రాన్నీ ఎంచుకునేటప్పుడు వారికి ఉన్న ప్రాధాన్యత నే పథకాలనీ అభివృద్ధి నీ ప్రాతిపదికగా తీసుకున్న మోడీ.
ముఖ్యమంత్రి గా చంద్రబాబు తీరుకు ప్రధానమంత్రి ఓకే అనుకుని ఐదవ ర్యాక్ ఇచ్చారట.
అయితే దీనిపై చంద్రబాబు తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారట.దీంతో చంద్రబాబు ఇటీవల ఈ విషయంపై చాలా ఆవేదన చెందుతూ అధికారుల వద్ద తన గోడు చెప్పుకున్నారట.
కాగా ఉత్తమ ముఖ్యమంత్రులు ర్యాంకింగులు ఇంతవరకు మోడీ బయటకు వెల్లడించనప్పటికీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆ సమాచారం తెలిసింది.ఈ నెల 16న ముఖ్యమంత్రులతో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించి.
ఆ సమావేశంలో మోడీ ఈ ర్యాంకులు ప్రకటిస్తారట.నిజానికి ఈ సమావేశం ఈ రోజే జరగాల్సి ఉన్నా కొందరు సీఎంలు విదేశాల్లో ఉన్నందున 16కి వాయిదా వేశారు.
ఈ నేపథ్యంలో 16న ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాను మోడీ వెల్లడిస్తారు.అయితే.
మంచి పాలకుడిగా పేరున్న తనకు అయిదో ర్యాంకు వస్తే తన పరువు పోతుందని చంద్రబాబు బాగా ఫీలవుతున్నారట.అంతేకాదు.
తాను ఎంతో కష్టపడి పనిచేస్తున్నా – కేంద్రం ఐదో రాంక్ ఇస్తోందని ఇది బాధాకరమని బాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం.