అమ్మో.. పార్క్ లో 87 కోట్లు విలువ చేసే గోల్డ్ క్యూబ్‌

మనం సాధారణంగా గోల్డ్ స్పూన్స్ గురించి వినుంటాం.గోల్డ్ బిస్కెట్స్ గురించి వినుంటాం.

 87 Crores Worth Gold Cube In New York Central Park Details, 87 Crores ,gold Cube-TeluguStop.com

కానీ ఒక భారి ఆకారంలో ఉండే గోల్డ్‌ క్యూబ్‌ గురించి వినుండం.పైగా అంత పెద్ద క్యూబ్‌ని ఒక ఓపెన్‌ పార్క్‌లో ఉంచడం గురించి అసలు విని ఉండరు.అంతేకాక, దీని విలువ ఏకంగా 11.7 మిలియన్ల డాలర్లట.అంటే ఇండియన్ కరెన్సీలో రూ.87 కోట్లు.ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా.?

న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్‌లో బంగారంతో చేసిన భారీ క్యూబ్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది.దాదాపు 186 కిలోగ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారంతో ఈ క్యూబ్ ని జర్మన్ కళాకారుడు నిక్లాస్ కాస్టెల్లో రూపొందించారు.అయితే దీనిని సెంట్రల్ పార్క్‌లో ప్రెజెంట్ చేయడానికి కూడా ఓ పెద్ద కారణమే ఉంది.

ఆ కళాకారుడు కొత్త క్రిప్టోకాయిన్‌ ప్రచార నిమిత్తం అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఈ సెంట్రల్‌ పార్క్‌లో ఉంచాడు.నిక్లాస్.క్రిప్టో కరెన్సీ బిజినెస్ లో రాణించాలని అనుకున్నాడు.అయితే దీనికి ప్రచారం ఎలా చేయలి అని ఆలోచిస్తుండగా.

తనకు ఈ గోల్డ్ క్యూబ్ ఆలోచన వచ్చింది.చాలామంది సందర్శకులు వచ్చి ఈ గోల్డ్ క్యూబ్‌ను చూసి, దీని ధర గురించి మాట్లాడుతూ ఉండగా నిక్లాస్ వ్యాపారానికి ప్రమోషన్స్ జరిగినట్టు అయ్యింది.

Telugu Carat Gold Cube, Artist, Bit Coins, Crypto Currency, German Artist, Gold

మానవజాతి చరిత్రలో ఇంతకు ముందెన్నడూ ఇంత భారీ మొత్తంలో బంగారు క్యూబ్‌ని రూపొందించ లేదు.అయితే ఈ క్యూబ్‌ని అమ్మకానికి పెట్టడం లేదని ఆయన తెలిపాడు.ఈ మేరకు ఈ గోల్డ్‌ క్యూబ్‌ ధర దాదాపు రూ.87 కోట్లు.అంతేకాదు ఈ క్యూబ్‌ని చేతితో తయారు చేసిన కొలిమి సాయంతోనే రూపొందించగలం అని వివరించాడు.ఈ భౌతిక కళాకృతి పేరున ఓ క్రిప్టోకరెన్సీ కాయిన్‌ని ప్రారంభించడమే కాకుండా.

ఎన్‌ఎఫ్‌టీల్లో వేలం వేయనున్నట్లు కళాకారుడు తెలిపాడు.ప్రస్తుతం న్యూయార్క్‌లో ఈ క్యూబ్ హాట్‌టాపిక్‌గా మారింది.

దీన్ని చూసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube