7 గం. పాటు నిలిచిపోయిన విమానం.. సహనం కోల్పోయిన పైలట్ ఏం చేశాడంటే?

ట్రాఫిక్ అనేది ఇపుడు అంతటా పెద్ద సమస్యగా మారుతోంది.ఓ వైపు జనాభా పెరుగుదల, మరోవైపు విచ్చవిడిగా వాహనాలు పెరగడంతో సాధారణ రోడ్లపైకూడా రద్దీ ఏర్పడిన పరిస్థితిలో వున్నాం.

 7 Hours The Plane That Stopped Along What Did The Impatient Pilot Do, 7 Hours , 7 Hours The Plane That Stopped , Pilot ,gatwick Airport In The Uk, Impatient Pilot,flights Are Also Traffic,viral News , Social Media-TeluguStop.com

అయితే ఇది ఒక్క రోడ్డు రవాణాకు మాత్రమే పరిమితం కాలేదు.అనుకోని కొన్ని కారణాల వలన అప్పుడప్పుడు విమానాలు కూడా ట్రాఫిక్ కారణంగా కొన్ని గంటలపాటు నిలిచిపోయిన ఘటనలు అనేకం వున్నాయి.

తాజాగా ఓ విమానం దాదాపు 7 గంటల పాటు రన్ వే పైనే నిలిచిపోయింది.సాధారణంగా ఇటువంటి ఘటనల్లో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తుంటారు.

 7 Hours The Plane That Stopped Along What Did The Impatient Pilot Do, 7 Hours , 7 Hours The Plane That Stopped , Pilot ,Gatwick Airport In The UK, Impatient Pilot,Flights Are Also Traffic,viral News , Social Media-7 గం. పాటు నిలిచిపోయిన విమానం.. సహనం కోల్పోయిన పైలట్ ఏం చేశాడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఇక్కడ.ఆ విమానం నడిపే పైలట్ కోపంతో ఊగిపోయాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే, UKలోని గాట్విక్ ఎయిర్ పోర్ట్ గత కొన్ని రోజులుగా ప్రయాణికుల రద్దీతో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.అందువలన వచ్చిపోయే విమానాలు గంటల తరబడి ఆలస్యం అవుతున్నాయి.

ఈక్రమంలో గురువారం నాడు గాట్విక్ ఎయిర్‌పోర్ట్ నుంచి సైప్రస్ లోని లార్నాకా వెళ్లాల్సిన wizz air W95749 విమానాన్ని సుమారు 7 గంటల పాటు రన్ వే పైనే నిలిపివేశారు గాట్విక్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది.ఇక ఎయిర్ ట్రాఫిక్ నుంచి ఎంతకూ అనుమతి రాకపోవడంపై అందులో వున్న విమాన పైలట్ సహనాన్ని కోల్పోయాడు.

Telugu Hours, Hoursplane, Flights, Pilot, Wizz Air-Latest News - Telugu

దాంతో గట్టిగా అరుస్తూ.“ఇక చాలు.నా వల్ల కాదు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు.దిగిపోవాలనుకునే ప్రయాణికులు ఒక్కసారి చేతులు పైకెత్తండి.మీరు దిగి వెళ్ళిపోతేగాని ఈరోజు మనం ఇక్కడి నుంచి బయటపడలేము.నా తోటి సిబ్బంది కూడా అవసరం లేదు.

ఇక్కడి నుంచి బయటపడేందుకు నేను చేయాల్సిందంతా చేశాను.ఇప్పుడు నా చేతుల్లో ఏమి లేదు.మీరు దిగిపోతానంటే నిరభ్యంతరంగా దిగిపోవచ్చు.” అంటూ పైలట్ అనౌన్స్ చేశాడు.ఇది విన్న ప్రయాణికులు షాక్ అయ్యారు.అయితే ఇలాంటి పరిస్థితిలో తమ మనసులోని దుఃఖం కూడా అదేవిధంగా వుందని అతన్ని సపోర్ట్ చేసారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube