7 గం. పాటు నిలిచిపోయిన విమానం.. సహనం కోల్పోయిన పైలట్ ఏం చేశాడంటే?

ట్రాఫిక్ అనేది ఇపుడు అంతటా పెద్ద సమస్యగా మారుతోంది.ఓ వైపు జనాభా పెరుగుదల, మరోవైపు విచ్చవిడిగా వాహనాలు పెరగడంతో సాధారణ రోడ్లపైకూడా రద్దీ ఏర్పడిన పరిస్థితిలో వున్నాం.

అయితే ఇది ఒక్క రోడ్డు రవాణాకు మాత్రమే పరిమితం కాలేదు.అనుకోని కొన్ని కారణాల వలన అప్పుడప్పుడు విమానాలు కూడా ట్రాఫిక్ కారణంగా కొన్ని గంటలపాటు నిలిచిపోయిన ఘటనలు అనేకం వున్నాయి.

తాజాగా ఓ విమానం దాదాపు 7 గంటల పాటు రన్ వే పైనే నిలిచిపోయింది.

సాధారణంగా ఇటువంటి ఘటనల్లో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తుంటారు.కానీ ఇక్కడ.

ఆ విమానం నడిపే పైలట్ కోపంతో ఊగిపోయాడు.పూర్తి వివరాల్లోకి వెళితే, UKలోని గాట్విక్ ఎయిర్ పోర్ట్ గత కొన్ని రోజులుగా ప్రయాణికుల రద్దీతో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

అందువలన వచ్చిపోయే విమానాలు గంటల తరబడి ఆలస్యం అవుతున్నాయి.ఈక్రమంలో గురువారం నాడు గాట్విక్ ఎయిర్‌పోర్ట్ నుంచి సైప్రస్ లోని లార్నాకా వెళ్లాల్సిన Wizz Air W95749 విమానాన్ని సుమారు 7 గంటల పాటు రన్ వే పైనే నిలిపివేశారు గాట్విక్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది.

ఇక ఎయిర్ ట్రాఫిక్ నుంచి ఎంతకూ అనుమతి రాకపోవడంపై అందులో వున్న విమాన పైలట్ సహనాన్ని కోల్పోయాడు.

"""/"/ దాంతో గట్టిగా అరుస్తూ."ఇక చాలు.

నా వల్ల కాదు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు.దిగిపోవాలనుకునే ప్రయాణికులు ఒక్కసారి చేతులు పైకెత్తండి.

మీరు దిగి వెళ్ళిపోతేగాని ఈరోజు మనం ఇక్కడి నుంచి బయటపడలేము.నా తోటి సిబ్బంది కూడా అవసరం లేదు.

ఇక్కడి నుంచి బయటపడేందుకు నేను చేయాల్సిందంతా చేశాను.ఇప్పుడు నా చేతుల్లో ఏమి లేదు.

మీరు దిగిపోతానంటే నిరభ్యంతరంగా దిగిపోవచ్చు." అంటూ పైలట్ అనౌన్స్ చేశాడు.

ఇది విన్న ప్రయాణికులు షాక్ అయ్యారు.అయితే ఇలాంటి పరిస్థితిలో తమ మనసులోని దుఃఖం కూడా అదేవిధంగా వుందని అతన్ని సపోర్ట్ చేసారు.

వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?