ప్రస్తుత కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి వావి వరసలు మరియు వయసుతో సంబంధం లేకుండా ప్రవర్తిస్తూ చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు.కాగా తాజాగా ఓ వివాహిత తన భర్త చనిపోవడంతో తన కూతురికి తండ్రిగా ఉంటాడని మరో వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోగా చివరికి ఆ వ్యక్తి తన భార్య కూతురుని ప్రేమలోకి దింపి లేచిపోయి పెళ్లి చేసుకున్న ఘటన ఇండోర్ పరిసర ప్రాంతంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక ప్రాంతంలో రేఖ (పేరు మార్చాం) అనే 45 సంవత్సరాల కలిగిన వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.అయితే రేఖ కి శాంతి అనే 25 సంవత్సరాలు కలిగిన కూతురు కూడా ఉంది.
కాగా ఇటీవలే రేఖ మొదటి భర్త పలు అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందాడు.దీంతో రేఖ తన కూతురికి తండ్రి లేని లోటు తీర్చడం కోసం స్థానికంగా ఉన్నటువంటి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
అయితే పెళ్లయిన కొంతకాలం వరకూ వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు.కాగా ఇటీవలే రెండో భర్త వక్ర బుద్ధి బయట పడింది.తన కూతురు వరుసైన యువతి ని కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి చివరికి ఆమెను ప్రేమ లోకి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.దీంతో ఈ విషయం రేఖ చెవినపడటంతో తన భర్త మరియు కూతురుని మందలించింది.
అంతేగాక కొద్దిరోజుల పాటు తన కూతురిని తన రెండో భర్తకి దూరంగా తన బంధువుల ఇంట్లో ఉంచి పెంచింది.దీంతో రేఖ భర్త తన ప్రియురాలిని చూడకుండా ఉండలేకపోయాడు.దీంతో తాజాగా వీరిద్దరూ కలిసి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.దీంతో రేఖ దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి తన రెండో భర్తపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది.
దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అంతేగాక కొందరు ఈ విషయంపై స్పందిస్తూ ఈ మధ్య కాలంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని అలాగే ఎవరిని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో బొత్తిగా అవగాహన లేకుండా పోతోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నకూతురిని లైంగికంగా వేధించి ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తిని దారుణంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.