అమెరికాలో జాత్యాహంకార హత్యలు ఎక్కువగా జరుగుతాయనేది అందరికి తెలిసిన విషయమే.ఈ మధ్య కాలంలో భారతీయుల మీద ఇలాంటి జాత్యాహంకార దారులు ఎక్కువగా జరుగుతున్నాయనేది అందరికి తెలిసిన విషయమే.
ముఖ్యంగా భారతీయులు అమెరికా వెళ్లి అక్కడ వారికి ఉద్యోగాలు లేకుండా చేస్తుననరనేది వారి అభిప్రాయం.దీంతో భారతీయుల మీద ప్రతీకారం పెంచుకుంటున్న వారు, జాత్యాహంకార వాఖ్యలు చేసి రెచ్చగొట్టడం, లేదంటే దాడులకి తెగబడటం చేస్తున్నారు.
తాజాగా అమెరికాలో ఓ భారతీయ విద్యార్ధిని కిరాతకంగా హత్య చేసారు.
మైసూరుకు చెందిన అభిషేక్ సుధేశ్ భట్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో(California State University in San Bernardino) కంప్యూటర్ సైన్సు డిగ్రీ చదువుతున్నాడు.
అక్కడ చదువుతూనే ఓ హోటల్ లో పార్ట్ టైం ఉద్యోగం కూడా అతను చేస్తున్నాడు.పని నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు విద్యార్థిపై దాడి జరిగింది,దుండగుడు తుపాకీతో అతనిని సమీపం నుంచి కాల్చినట్లు తెలుస్తోంది.
దీంతో అతను సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలాడు.మరో నాలుగు నెలల్లో అభిషేక్ చదువు పూర్తవుతుంది.ఇలాంటి సమయంలో ఆ దుండగుడు అభిషేక్‌ను ఏ కారణం వల్ల చంపాడన్న విషయం తెలియాల్సి ఉంది.
అభిషేక్ మైసూరులోని జ్ఞానగంగ విద్యా సంస్థ నుండి ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశాడు.20 నెలల క్రితం కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చదివేందుకు అభిషేక్ అమెరికా వెళ్లారు.కోర్సు పూర్తి చేయడానికి అతనికి ఇంకా నాలుగు నెలల సమయం ఉంది.
అభిషేక్ కూడా అమెరికాలో ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు పనిచేయాలని అనుకున్నాడు.
అభిషేక్ మృత దేహాన్ని భారత్‌కు రప్పించేందుకు అమెరికా కాన్సులేట్, భారత హైకమిషన్‌ను సంప్రదించామని అభిషేక్ ఎందుకు చనిపోయాడన్న అంశంపై మాకు ఇంకా స్పష్టత లేదని అతని కుటుంబ సభ్యుడు తెలిపారు.