పబ్​జీ ప్రేమ: స్నేహితుడి కోసం ఏకంగా రైలులోనే బాంబు పెట్టిన బాలుడు?

పబ్​జీ ప్రేమకి బలైన ఓ బాలుడు చేసిన నిర్వాకం రైల్వే పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేసింది.స్పేహితుడితో కలిసి పబ్ జీ గేమ్ ఆడుతున్న 12 ఏళ్ల బాలుడు ఆట మధ్యలో ఆగిపోకూడదన్న నెపంతో పోలీసులకు ఫోన్​ చేసి, స్నేహితుడు ప్రయాణించాల్సిన రైలులో బాంబు ఉందని చెప్పి, దాదాపు ఓ 3 గంటలు సమయం పాటు రైలుని ఆపివేసేలా చేసాడు.

 12 Years Pubg Addicted Boy Made Fake Bomb Call To Yelahanka Railway Station Deta-TeluguStop.com

ఈ క్రమంలో ప్రయాణికులు కూడా బెంబేలెత్తి పోయి తాము వెళ్ళవలసిన గంటలకు వెళ్లకుండానే ఇళ్లకు వెనుదిరిగారు.తీరా విషయం తెలిసిన పోలీసులు ఖంగు తిన్నారు.

అసలు విషయంలోకి వెళితే, మొన్న అనగా మార్చి 30న బెంగళూరులోని యలహంక రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి రావడం గమనార్హం.రైల్వే పోలీసుల కథనం ప్రకారం.30న మధ్యాహ్నం రైల్వే పోలీస్ హెల్ప్‌లైన్‌కు ఓ బాలుడు ఫోన్ చేసి.“రైలులో బాంబు పెట్టాము.అది ఏ క్షణాన్నైనా పేలుతుంది.” అని చెప్పగానే అప్రమత్తమైన పోలీసులు రైళ్లను ఎక్కడికక్కడ ఆపేసి బాంబ్ స్క్వాడ్‌తో కలిసి స్టేషన్‌లో బాంబు కోసం ముమ్మురంగా తనిఖీలు చేపట్టారు.సుమారు ఓ 3 గంటల పాటు ప్రయాణికులను అక్కడికి అనుమతించలేదు.

ఇక ఎంత వెతికినా బాంబు జాడ తెలియకపోవడంతో కాల్​ వచ్చిన నంబర్​కు అధికారులు పలుమార్లు ఫోన్​ చేయగా అది స్విచ్ఛాఫ్​ వచ్చింది.

Telugu Boy, Hours, Bad, Bangalore, Bomb, Games, Signals, Pubg Boy, Pubg Lovers,

ఈ క్రమంలో వాళ్ళు తమ తెలుసున్నది ఏమనగా అది ఉత్తుత్తి బెదిరింపుగా గుర్తించారు.ఇంతకీ విషయం ఏమంటే, మార్చి 30న ఫోన్​కాల్​ చేసిన బాలుడి స్నేహితుడు యళహంక రైల్వే స్టేషన్​ నుంచి వెళ్తున్న కాచిగూడ ఎక్స్​ప్రెస్​లో ప్రయాణించాల్సి ఉంది.ప్రయాణం మొదలయితే రైలులో ఎక్కడ నెట్ వర్క్ సమస్య వచ్చి, ఆట మధ్యలోనే ఆగిపోతుందనే భయంతో ప్రయాణాన్ని ఆపేందుకు ఆ బాలుడు.రైల్వే పోలీసులకు ఫోన్​ చేసి ఆ ట్రైన్​​లో బాంబు ఉందని చెప్పినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఫోన్​ చేసిన అతడు మైనర్​ కావడం వల్ల అతడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేసు పెట్టకుండా హెచ్చరించి వదిలేశారు అధికారులు, ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube