11 ఏళ్ల కుర్రాడు ప్రాణాలను లెక్క చేయకుండా 8 మంది పిల్లల ప్రాణాలు కాపాడాడు

ప్రాణాల మీదకు వస్తుందంటే అందరు కూడా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు సాద్యమైనంత వరకు ప్రయత్నిస్తారు.తమ వారు ఉన్నా, స్నేహితులు ఉన్నా ఇంకెవ్వరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా మొదట తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నిస్తారు.

 11 Year Old Om Prakash Yadav Has Saved 8 Children From Burning School Bus-TeluguStop.com

ఆ తర్వాత స్నేహితులైనా చుట్టాలనైనా కాపాడేందుకు ప్రయత్నిస్తారు.కాని 11 ఏళ్ల ఏం ప్రకాష్‌ మాత్రం తన ప్రాణాల గురించి ఆలోచించకుండా 8 మంది తన స్నేహితుల ప్రాణాలను కాపాడాడు.

అతడు చేసింది చిన్న పని అని అతడు అనుకుంటూ ఉంటాడు.కాని అతడు ఎంత గొప్ప పని చేశాడో ఆ 8 మంది పిల్లల తల్లిదండ్రులను అడిగితే అర్థం అవుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజమ్‌ఘర్‌ అనే సిటీకి చెందిన కుర్రాడు ఓం ప్రకాష్‌ యాదవ్‌.

తన 11 ఏళ్ల వయసులో ఒక రోజు స్కూల్‌ బస్సులో స్కూల్‌కు వెళ్తున్నాడు.స్కూల్‌ బస్సులో అంతా కూడా నవ్వుతూ తుల్లుతూ ఉన్నారు.

చిన్న పిల్లలు సరదాగా అల్లరి చేస్తూ ఆడుకుంటూ స్కూల్‌కు వెళ్తున్నారు.బస్‌ స్పీడ్‌గా వెళ్తున్న సమయంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి.

ఇంజన్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఆ మంటలు వచ్చి ఉంటాయని డ్రైవర్‌ అనుకున్నాడు.బస్సు స్లో చేసేలోపే మంటలు చాలా పెద్దగా అయ్యాయి.

డ్రైవర్‌ భయంతో డోర్‌ తీసుకుని పరిగెత్తాడు.అందులో ఉన్న పిల్లలు మాత్రం భయంతో ఆహాకారాలు చేస్తున్నారు.ఆ సమయంలోనే ఓం ప్రకాష్‌ చాలా కష్టపడి ఒక గ్లాస్‌ను పగులగొట్టి 8 మంది పిల్లలను అందులోంచి దించేశాడు.అద్దం గులకొట్టిన వెంటనే ఓం ప్రకాష్‌ దూకి ఉంటే అతడు ఎలాంటి గాయాలు కాకుండా బయట పడేవాడు.కాని తన తోటి వారిని, తన కంటే చిన్న వారికి దించేందుకు ప్రకాష్‌ అలాగే ఉన్నాడు.8 మంది పిల్లలు కిందకు దిగిన తర్వాత అప్పుడు ప్రకాష్‌ కూడా దిగాడు.

Telugu Om Prakash, Azamgarh, Braveheart, Saved Childrens-Inspirational Storys

 

ప్రకాష్‌ దిగే సమయానికి బస్సు సగం వరకు మంటలు అంటుకుంది.ఆ మంటల్లో చేతికి మొహంకు గాయాలు అయ్యాయి.ప్రకాష్‌ వాటిని పట్టించుకోకుండా చివరకు దూకాడు.బస్సు నుండి దూకిన పిల్లలు కొద్ది దూరం వెళ్లి నిల్చున్నారు.నిమిషాల వ్యవదిలోనే ఆ బస్సు బ్లాస్ట్‌ అయ్యింది.కొద్ది సమయం ఆలస్యం అయ్యి ఉంటే అందులో ఉన్న పిల్లలు అంతా కూడా కాలి బూడిద అయ్యే వారు.

అత్యంత ప్రమాదకరంగా జరిగిన ఈ సంఘటనలో పిల్లలందరు బయట పడ్డారంటే కేవలం ఓం ప్రకాష్‌ కారణంగానే.

ఆయన బాలుడు సాహసం చేయడం వల్ల 8 మంది పిల్లల కుటుంబ సభ్యులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు.

ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా ఓం ప్రకాష్‌కు కృతజ్ఞతలు చెపుతారు.ఓం ప్రకాష్‌ మొహం కాలిపోయింది.అతడి గాయం మానినా మొహంపై ఆ మచ్చ భయంకరంగా అలాగే ఉంది.కాని అతడు చేసిన పని మాత్రం లక్షలాది మంది హృదయాల్లో నిలిచి పోయి అతడిని అందంగా మార్చేసింది.

వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అలా దైర్య సాహసాలు ప్రదర్శిస్తే పోయేంత కాలం నలుగురు కాదు నాలుగు లక్షల మంది మంచి అనుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube