ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004వ సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో ప్రభంజనం సృష్టించి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన “దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి” కొడుకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.

 Ys Jagan Mohan Reddy, Andhra Pradesh Chief Minister, Ysrcp, Ys Rajasekhar Reddy,-TeluguStop.com

ఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సి అవసరం లేదు.అయితే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతోంది.

అయితే ఆ ఫోటో ని ఒకసారి పరిశీలించినట్లయితే అప్పట్లో వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి చదివినటువంటి ఓ పాఠశాలలో తన స్నేహితులతో కలిసి తీయించుకున్న ఫోటో అని తెలుస్తోంది.అయితే  ఈ పాఠశాలలో అప్పట్లో నలుగురు హౌస్ కెప్టెన్స్ ఉండేవారని ఇందులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకడని కొందరు చర్చించుకుంటున్నారు.

ఇదే పాఠశాలలో ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో సుమంత్ కూడా చదివాడని, అంతేగాక గతంలో సుమంత్ మరియు వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి ఓసారి నైట్ షో సినిమా కి వెళ్లి వచ్చినప్పుడు సుమంత్ తాత అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకొని క్లాస్ పీకిన ట్లు గతంలో సుమంత్ అక్కినేని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.అలాగే ఇప్పటికీ అక్కినేని సుమంత్ మరియు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంచి స్నేహితులు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తన తండ్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత రాజకీయ భాద్యతలను తన సొంత భుజాలపై వేసుకొని మోసాడు.ఈ క్రమంలో 2014వ సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ 2019వ సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలలో భారీ మెజార్టీ సీట్లతో విజయాన్ని కైవసం చేసుకున్నాడు.

అంతేగాక ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube