ఈరోజు వైఎస్సార్ జయంతి( YSR Jayanthi ) కావడంతో ఈరోజును వైఎస్సార్ అభిమానులు పండుగలా జరుపుకుంటున్నారు.జగన్ చెల్లి షర్మిల ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.
వైఎస్సార్టీపీ పార్టీ ద్వారా షర్మిల( YS Sharmila ) తెలంగాణ రాజకీయాల్లో సత్తా చాటుతారని అందరూ భావించగా తెలంగాణలో ప్రస్తుతం కొత్త పార్టీ బలపడే పరిస్థితులు అయితే లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఇడుపులపాయలో తన పేరుపై ఉన్న భూములను షర్మిల కొడుకు, కూతురు పేర్లపై తాజాగా రిజిస్ట్రేషన్ చేయించారు.నిన్న కడప విమానాశ్రయం నుంచి వేంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లిన షర్మిల ఇడుపులపాయలో తన పేరుపై ఉన్న 9.53 ఎకరాల భూమిని రాజారెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ చేయడం చేయడం గమనార్హం.ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలను చూసే వెంగమునిరెడ్డి నుంచి షర్మిల 2.12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.
ఈ భూమిని షర్మిల తన కూతురు అంజలీ రెడ్డి( Anjali Reddy ) పేరుపై రిజిష్టర్ చేయడం గమనార్హం.అయితే షర్మిల కొడుకు రాజారెడ్డిని( Rajareddy ) చూసిన అభిమానులు రాజారెడ్డి సినిమాల్లోకి వస్తే స్టార్ హీరో అవుతాడని కామెంట్లు చేస్తున్నారు.ఒక హీరోకు అవసరమైన అన్ని లక్షణాలు రాజారెడ్డిలో ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తే కూడా కచ్చితంగా సక్సెస్ అవుతారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మరి రాజారెడ్డికి సినిమాలపై ఆసక్తి ఉందో లేక రాజకీయాలపై ఆసక్తి ఉందో తెలియాల్సి ఉంది.షర్మిల, జగన్ సపోర్ట్ ఉంటే రాజారెడ్డి కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం కష్టం అయితే కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.షర్మిల కొడుకు, కూతురు కెరీర్ విషయంలో ఏ విధంగా ప్లాన్ చేస్తారో చూడాల్సి ఉంది.వైఎస్సార్ కూతురు షర్మిల రాజకీయాల్లో సక్సెస్ సాధించాలని వైఎస్సార్ అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.