ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila ) రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు.ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీపై ఘాటు విమర్శలు చేయడం ద్వారా ఆమె తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
షర్మిల కొడుకు, రాజారెడ్డి,( Rajareddy ) ప్రియ( Priya ) వివాహం రాజస్థాన్ లోని జోధ్ పూర్ ప్యాలేస్ లో అంగరంగ వైభవంగా జరిగింది.హైదరాబాద్ లో తాజాగా రిసెప్షన్ జరగగా సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
శంషాబాద్ లోని ఫోర్ట్ గ్రాండ్ హోటల్ లో రిసెప్షన్ ను నిర్వహించడం గమనార్హం.“క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి .తర్వాత తెలుగు స్టైల్ లో తలంబ్రాల దృశ్యం” అంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.అయితే ఈ వీడియోలో షర్మిల సంతోషంగా డ్యాన్స్ లు( Sharmila Dance ) వేయడం గమనార్హం.
ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.కొడుకు పెళ్లి సంతోషం అంతా షర్మిల కళ్లలోనే కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
పెళ్లి వేడుకలు పూర్తి కావడంతో షర్మిల రాజకీయాలపై దృష్టి పెట్టారు.సోషల్ మీడియాలో తనపై విమర్శలు చేస్తున్న కొంతమందిపై షర్మిల ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఏపీలోని అన్ని స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు( Congress Candidates ) పోటీ చేసేలా షర్మిల ప్రణాళిక ఉంది.షర్మిలకు ఏపీలో 3 శాతం ఓటింగ్ ఉందని పలు సర్వేల ద్వారా వెల్లడవుతోంది.
షర్మిల ఎక్కడినుంచి పోటీ చేస్తారనే ప్రశ్నకు సైతం జవాబు దొరకాల్సి ఉంది.
రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని షర్మిల భావిస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అది సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.షర్మిల పొలిటికల్ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.షర్మిల పొలిటికల్ కెరీర్ పరంగా సక్సెస్ కావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఏప్రిల్ మూడో వారం తర్వాత ఏపీలో ఎన్నికలు( AP Elections ) జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.