YS Sharmila : కొడుకు పెళ్లిలో అదిరిపోయే స్టెప్పులు వేసిన వైఎస్ షర్మిల.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!
TeluguStop.com
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila ) రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు.
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీపై ఘాటు విమర్శలు చేయడం ద్వారా ఆమె తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
షర్మిల కొడుకు, రాజారెడ్డి,( Rajareddy ) ప్రియ( Priya ) వివాహం రాజస్థాన్ లోని జోధ్ పూర్ ప్యాలేస్ లో అంగరంగ వైభవంగా జరిగింది.
హైదరాబాద్ లో తాజాగా రిసెప్షన్ జరగగా సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
శంషాబాద్ లోని ఫోర్ట్ గ్రాండ్ హోటల్ లో రిసెప్షన్ ను నిర్వహించడం గమనార్హం.
"క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి .తర్వాత తెలుగు స్టైల్ లో తలంబ్రాల దృశ్యం" అంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
అయితే ఈ వీడియోలో షర్మిల సంతోషంగా డ్యాన్స్ లు( Sharmila Dance ) వేయడం గమనార్హం.
ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.కొడుకు పెళ్లి సంతోషం అంతా షర్మిల కళ్లలోనే కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
"""/" /
పెళ్లి వేడుకలు పూర్తి కావడంతో షర్మిల రాజకీయాలపై దృష్టి పెట్టారు.
సోషల్ మీడియాలో తనపై విమర్శలు చేస్తున్న కొంతమందిపై షర్మిల ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏపీలోని అన్ని స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు( Congress Candidates ) పోటీ చేసేలా షర్మిల ప్రణాళిక ఉంది.
షర్మిలకు ఏపీలో 3 శాతం ఓటింగ్ ఉందని పలు సర్వేల ద్వారా వెల్లడవుతోంది.
షర్మిల ఎక్కడినుంచి పోటీ చేస్తారనే ప్రశ్నకు సైతం జవాబు దొరకాల్సి ఉంది. """/" /
రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని షర్మిల భావిస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అది సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
షర్మిల పొలిటికల్ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.షర్మిల పొలిటికల్ కెరీర్ పరంగా సక్సెస్ కావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఏప్రిల్ మూడో వారం తర్వాత ఏపీలో ఎన్నికలు( AP Elections ) జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
హీరోయిన్ వైష్ణవి చైతన్యను టార్గెట్ చేసి కామెంట్స్ చేశారా.. నిర్మాత ఎస్కేఎన్ క్లారిటీ ఇదే!