ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య...!

సూర్యాపేట జిల్లా:అక్రమ సంబంధం( Illegal affair ) నేపథ్యంలో ఓ భార్య కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బంధువులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…సూర్యాపేట జిల్లా ( Suryapet District )మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన వీర గోపయ్య (దివ్యాంగుడు),వీరకుమారి భార్యాభర్తలు.

 The Wife Who Killed Her Husband Along With Her Boyfriend, Illegal Affair, Husban-TeluguStop.com

వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.భార్య వీర కుమారికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని తెలియడంతో గతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈనేపథ్యంలో శనివారం రాత్రి భర్త మద్యం సేవించి ఇంటికి రావడంతో ఇదే అదునుగా భావించిన భార్య వీర కుమారి తన ప్రియుడితో కలిసి భర్తను ముఖంపై దిండు పెట్టి ఊపిరాకుండా చేసి హతమార్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే మద్యం సేవించి మత్తులో గుండె ఆగి మరణించినట్లునమ్మించి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు.

అంత్యక్రియలకు హాజరైనబంధువులు(తోబుట్టువులు) మృతదేహాన్ని పరిశీలించి మెడపై కమిలిన గుర్తులు ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.గ్రామానికి చేరుకున్న పోలీసులు( Police ) బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమ సంబంధం వల్లనే వీర గోపయ్య ను భార్య చంపిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube