Balayya Babu : గత 15 ఏళ్లలో బాలయ్య సినిమాల్లో ఎన్ని హిట్లో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

నందమూరి నటసింహం గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు( Balayya Babu ) వరుస సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నాడు.ఇక అదే ఊపులో ఆయన వైవిధ్యమైన పాత్రాలను పోషిస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు.

 You Will Be Surprised If You Know How Many Hits In Balayyas Movies In The Last-TeluguStop.com

ఇక నందమూరి నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు ( Nandamuri Taraka Rama Rao )గారి తనయుడుగా ఇండస్ట్రీ కి వచ్చినప్పటికి వరుస సక్సెస్ లు కొడుతూ ఇండస్ట్రీలో తండ్రి కి తగ్గ తనయుడిగా మంచి పేరునైతే సంపాదించుకున్నాడు.

ఇక ఇలాంటి బాలయ్యకి ఒకానొక సమయంలో సక్సెస్ లు లేక కెరియర్ అనేది డౌన్ ఫాల్ అయిపోయింది.ఇక ఆయన ఫేడ్ అవుట్ అవుతాడు అని అందరూ అనుకున్నారు.ఇక ఇలాంటి సమయంలోనే బోయపాటి శ్రీను ( Boyapati Srinu )’ సింహా ‘ సినిమాతో మరొకసారి బాలయ్య బాబు ను స్టార్ హీరోగా టాప్ రేంజ్ లో కూర్చోబెట్టాడనే చెప్పాలి.

 You Will Be Surprised If You Know How Many Hits In Balayyas Movies In The Last-TeluguStop.com

ఇక ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో బాలయ్య వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు.అయితే గత 15 సంవత్సరాలలో బాలయ్య బాబు కేవలం బోయపాటి ఇచ్చిన సినిమాలతోనే సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు అనే విషయం చాలా మందికి తెలియదు.

ముఖ్యంగా సింహా, లెజెండ్, అఖండ ( Simha, Legend, Akhanda )లాంటి సినిమాలే ఆయనకి సూపర్ డూపర్ హిట్లను అందించాయని చెప్పవచ్చు.

ఇక మిగతా సినిమాలు ఒకటి రెండు ఆవరేజ్ గా ఆడినప్పటికి సూపర్ సక్సెస్ సాధించిన సినిమా అయితే ఏది లేదు. వీర సింహారెడ్డి, భగవత్ కేసరి( Veera Simha Reddy ,Bhagwat Kesari ) లాంటి సినిమాలు యావరేజ్ లుగా నిలిచాయి.కాకపోతే బోయపాటి చేసిన మూడు సినిమాలు మాత్రమే సాలిడ్ హిట్లు గా నిలిచాయి.

ఇక ఇప్పుడు బాలయ్య బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని సీనియర్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube