నేషనల్ ఫ్రెష్ గా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో రష్మిక మందన్న ( Rashmika Mandanna ) ఒకరు.ఈమె హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా హీరోయిన్గా ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రష్మిక ప్రస్తుతం బాషతో సంబంధం లేకుండా అన్ని భాషా చిత్రాలలో హీరోయిన్గా నటిస్తూ బిజీ అయ్యారు.ఇటీవల ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన యానిమల్( Animal )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని ఫోటోలు వీడియోలను ఈమె అభిమానులతో పంచుకుంటారు.తాజాగా ఈమె ఒక సెల్ఫీ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు అయితే ఈమె చేతి వేళ్లపై ఉన్నటువంటి టాటూ బయటపడింది రష్మిక చేతి వేలు పై ఉన్నటువంటి టాటూ ఏంటి అసలు ఆ టాటూ అర్థమేంటి అని ఆరా తీయడం మొదలు పెట్టారు.
రష్మిక చేతి మనకట్టుపై ఒక టాటూ ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఆమె చేతిపై ఇర్రీప్లేసబుల్ ( Irreplaceable )అని కనిపిస్తుంది.ఈ టాటూ అర్థం గతంలో ఓసారి రష్మిక చెబుతూ మనలోని ప్రతి ఒక్కరూ వారి వారి మార్గాల్లో ప్రత్యేకంగా ఉంటారు.
మీ జీవితంలో ఎవరూ మిమ్మల్ని మరోక వ్యక్తితో భర్తీ చేయలేరని అర్థం వస్తుందని అందుకే ఆ టాటూని నేను కాలేజీ చదువుతున్న రోజుల్లోనే వేయించుకున్నానని తెలిపారు.ఇంకా తన చేతి వేలు పై ఇన్ఫినిటీ ( Infinity )అనే టాటూ వేయించుకున్నారు ఇన్ఫినిటీ అంటే అనంతం అని అర్థం.
దీంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది.ఇది చూసినటువంటి నెటిజన్స్ ఇన్ని రోజులు ఎప్పుడు రష్మిక చేతి వేలి పై ఈ టాటూ గమనించలేదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
.