తెలంగాణ ఎన్నికలలో జనసేన( Janasena ) ఎనిమిది చోట్ల పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది.బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన గాని ఎక్కడ కూడా జనసేనకు ఓట్లు సరిగ్గా రాలేదు.
డిపాజిట్లు కూడా రాకపోవడంతో ప్రత్యర్థులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.అసలు జనసేన పోటీ చేయకుండా ఉంటే బాగుండేదని పార్టీ కార్యకర్తలు అభిమానులు లోలోపల భావిస్తున్నారు.
సరిగ్గా ఏపీలో ఎన్నికలకు ముందు ఈ రకమైన నిర్ణయం కొద్దిగా పార్టీపై ప్రభావం చూపించే అవకాశం ఉందని బాధపడుతున్నారు.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రచారం నిర్వహించిన చోట్ల భారీ ఎత్తున జనాలు వచ్చారు.
కానీ వచ్చిన జనాలను ఓట్ల రూపంలో మార్చుకోలేకపోయారు.ఫలితంగా తెలంగాణ( Telangana )లో జనసేన ఓడిపోవడం జరిగింది.
ఈ క్రమంలో వైసీపీ పార్టీ మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ).తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన ఓడిపోయిన తర్వాత సోషల్ మీడియా వేదికగా వరుస పెట్టి సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే.జనసేన జెండా ఎన్టీఆర్ భవన్ కి, తెలుగుదేశం జెండా గాంధీభవన్ కి.సిగ్గు శరం లేని వాళ్ళు అంటూ సోమవారం ఉదయం పోస్ట్ చేశారు.ఇక సాయంత్రం “అక్కడ బీజేపీకి.ఇక్కడ టీడీపీకి మద్దతు “కాల్ షీట్లు” లా ఇచ్చాడు అంటూ పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.