తరచూ మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ ఛార్జీ అయిపోతోందా ? అత్యవసర సమయాల్లో ఛార్జింగ్ కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారా ? ఇలా తరచూ బ్యటరీ ఛార్జ్ చేయాల్సి వస్తోందా ? అయితే ఇలంటి వారి కోసం వన్‌ప్లస్ మార్గం చూపెట్టడానికి ఓ సరికొత్త వేరియంట్ ఫోన్‌ను తీసుకొస్తోంది.ఇక మీ సమస్య తీరినట్టే.
ఎందుకంటే ఇప్పవరకు అనేక కంపెనీలు వివిధ రకాల వేరియంట్‌తో ఫోన్‌లనుతీసుకొచ్చాయి.ఇందులో బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉండేవి కూడా ఉన్నాయి.
మరికొన్ని కెమెరాకు ప్రాధాన్యత ఇచ్చి తీసుకొచ్చిన ఫోన్లు కూడా ఉన్నాయి.అయితే అతితక్కువ సమయంలో బ్యాటరీ ఛార్జ్ అయ్యే వాటి విషయంలో మాత్రం వన్ ప్లస్ ఓ ముందడుగేసింది.
భారత మార్కెట్‌లోకి వన్ ప్లస్ మరో కొత్త మోడల్‌తో రానున్నట్టు ప్రకటించింది.వరుసగా కొత్త స్మార్ట్ ఫక్షన్ మోడల్స్‌తో వన్‌ప్లస్ వస్తోంది.
తాజాగా వన్‌ప్లస్ నార్డ్-3 పేరుతో ఓ కొత్త మోడల్‌ను భారత మార్కట్ లోకి తెస్తున్నట్టు తెలిపింది.కా ఫోన్‌ను ఏ్రపిల్, జూన్ నెల మధ్యలో విడుదల చేయున్నట్టు తెలిసింది.
కాగా ఇందులో పొందుపర్చిన ఫ్యూచర్లు చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే.సరికొత్త ఫ్యూచర్‌తో ఫోన్‌ను వన్‌ప్లస్ లాంచ్ చేయనుంది.
ఆ విశేషాలేంటో చూద్దామా.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నార్డ్-3 ఫోన్‌లో 6.7 ఇంచుల ఫుల్ హెచడీ ప్లస్ ఓఎల్ీడీ డిస్‌ప్లేను అందించనున్నారు.ఏ-78 కోర్ మీడియాఆటెక్ డైమెన్సటీ 8100 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.ఇక కెమెరా ఫ్యూచర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.50 మెగాపిక్సెల్ సోని ఐఎంఎక్స్ 766 రెయిర్ కెమెరాతోపాటు సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్‌తో పంచ్ హోల్ కెమెరా రూపొందించారు.అలాగే రియల్‌మీ జీటీ నియో-3తో సమానమైన ఫీచర్లు అందిస్తున్నారు.దీని ధర మాత్రం ఇంకా వెల్లడించలేదు.ఇందులో మరో ప్రత్యేకత ఉంది.కేవలం 15 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది.150 వాట్స్ సూపర్ వీఓఓసీ ఛార్జింగ్ టెక్నాలజీ సదుపాయం కూడా కల్పించారు.దీని ద్వారా అది 15 నిమిషాల్లోనే ఛార్జ్ అవుతుంది.
.