అచ్చెన్న కు చెక్.. జగన్ స్కెచ్ అదే ?

ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మద్య రసవత్తరమైన పోరు నడుస్తోంది.ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది పైచేయి సాధించేందుకు ఇరు పార్టీల అధినేతలు అస్త్రశాస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి.

 Will Ycp Give A Check To Achchennaidu ,kinjarapu Atchannaidu, Ys Jagan, Ap Polit-TeluguStop.com

ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలలోని కీలక నేతలను దెబ్బతీసేందుకు ఇరు పార్టీలు కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నాయి.టీడీపీ అధినేత చంద్రబాబును కుప్పంలో ఒడిస్తామని వైసీపీ గట్టిగా చెబుతోంది.

చంద్రబాబుని ఢీ కొట్టే నేతకోసం గట్టిగానే సర్చింగ్ మొదలు పెట్టింది వైసీపీ.అలాగే టీడీపీ కూడా పులివెందులలో జగన్ ను ఓడించి తీరుతామని తొడకొడుతోంది.

Telugu Ap, Chandra Babu, Kuppam, Ys Jagan-Politics

ఇలా అధినేతల నియోజిక వర్గాలే టార్గెట్ గా రెండు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.ఇదిలా ఉంచితే ఇరు పార్టీలలోని కీలక నేతలపై కూడా అధినేతలు గట్టిగా ఫోకస్ చేస్తున్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ), చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి వంటి వారిని.వారి నియోజిక వర్గాల్లోనే ఓడించాలని అధినేత చంద్రబాబు ప్లాన్ చేస్తుంటే.మరోవైపు టీడీపీలోని కీలక నేతలు అచ్చెన్నాయుడు( Kinjarapu Atchannaidu), అయ్యన్న పాత్రుడు వంటివారిని ఓడించేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న అచ్చెన్నాయుడు నియోజిక వర్గంపై జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారట.వైసీపీని ఇరకాటంలో పెట్టడంలోనూ, పదునైన విమర్శలతో దాడి చేయడంలోనూ అచ్చెన్న ముందు వరుసలో ఉంటాడు.

Telugu Ap, Chandra Babu, Kuppam, Ys Jagan-Politics

అంతే కాకుండా టీడీపీ అధ్యక్ష హోదాలో కూడా ఉండడంతో అచ్చెన్న ను ఆయన నియోజిక వర్గంలో ఒడిస్తే టీడీపీని గట్టిగా దెబ్బతీసినట్లే అనే భావన జగన్ ఉన్నారట.అందుకే అచ్చెన్న ప్రాతినిథ్యం వహిస్తున్న టెక్కలి నియోజిక వర్గంలో ఆయనపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ( Duvvada Srinivas)సతీమణి వాణి ని బరిలోకి దించేందుకు వైఎస్ జగన్ ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి.వాణికి గతంలో అచ్చెన్నాయుడు పై పోటీ చేసిన అనుభవం కూడా ఉంది.పైగా టెక్కలి నియోజిక వర్గంలో అచ్చెన్నాయుడుపై కొంత వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో తేలిందట.అందుకే ఈసారి టెక్కలి నియోజిక వర్గంలో అచ్చన్నకు షాక్ ఇచ్చే విధంగా జగన్ పక్కా వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది.మరి ఈసారి టెక్కలిలో అచ్చెన్నాయుడు కు వైసీపీ ఎంతవరకు పోటీ ఇస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube