జ్వరం వస్తే సీనియర్ ఎన్టీఆర్ అలా చేసేవారా.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

తెలుగు సినీ ప్రేక్షకులకు తెలుగు తెర నటన సార్వభౌముడు సీనియర్ నటుడు, ఎన్టీ రామారావు ( Senior actor, NT Rama Rao )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.దివంగత నటుడు అయినా సీనియర్ ఎన్టీఆర్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడుగా దర్శకుడుగా నిర్మాతగా రాజకీయ నాయకుడిగా ఇలా అన్ని రంగాలలో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.

 Nt Ramarao If Get Fever What He Did Balakrishna Chandrababu Revealed That Secret-TeluguStop.com

బెస్ట్ యాక్టర్‌గా ఆయన ముందు వరుసలో ఉంటారు.అంతే కాకుండా తెలుగు సినిమాకి ఒక కన్నులా కూడా ఉన్నారు.

అలాగే రాజకీయాల్లోనూ, సీఎంగా చేసిన కార్యక్రమాల విషయంలో ఆయనే ముందు వరుసలో ఉంటారు.రూపులో ఆయన ఆజానుభావుడిలా ఉండేవారు.

వెండితెరపై రాముడి వేషం, కృష్ణుడి వేషాల్లో ఆయన్ని కొట్టేవారే లేరని చెప్పాలి.అయితే ఆయన ప్రస్తుతం భౌతికంగా మన మధ్య లేనప్పటికి ఆయన జ్ఞాపకాలు మాత్రం ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి.

రామారావు ఆరోగ్యం విషయంలో చాలా కేర్‌ తీసుకునేవారు.అయితే ఆయన ఫుడ్‌ విషయంలోనూ తగ్గేవాళ్లు కాదు.ఎంత బాగా తింటారో, అంతే కష్టం కూడా చేస్తారు.ఆ టైమ్‌ లో వర్కౌట్స్ చేయడానికి జిమ్‌లు లేవు.

అందుకే ఫిజికల్‌గా కష్టపడేవారు.ఉదయం మూడు గంటలకు లేసి ఎక్సర్‌సైజ్‌ కోసం ఆయన ఇంటి వద్ద ఇసుక కుప్పని ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఎత్తి పోసేవారట.

అదే వ్యాయామంగా భావించేవారట.ఆయనకు అనారోగ్య సమస్యలు వచ్చేవి కావని, అంతటి హెల్డీగా ఉండేవారట.

Telugu Balakrishna, Chandra Babu, Ntramarao, Senior Ntr, Tollywood-Movie

అయితే ఎప్పుడైనా జ్వరం( fever ) వచ్చినా మెడిసిన్‌ వాడేవారు కాదు.ఆ విషయాన్ని బయట పెట్టారు బాలయ్య.జ్వరం వచ్చిందంటే ఆయన చికెన్‌ తినేవాడట.పెద్దాయన లేవగానే ఒక కోడి మొత్తాన్ని తినేవారని, ఆయన ఆరోగ్య రహస్యం అదే అని చెప్పారు.60 ఏళ్లు వచ్చినా, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవంటే కారణం ఆయన తీసుకునే ఫుడ్‌, క్రమశిక్షణ అని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.ఈ సందర్భంగా బాలయ్య స్పందిస్తూ మరో రహస్యం తెలిపారు.

జ్వరం వస్తే ఎన్టీఆర్‌ చేసే పనేంటో బయటపెట్టారు.ఒక కోడి మొత్తానికి ఉప్పు కారం గట్టిగా దట్టించేవారటని, మంచి ఘాటుగా ఉండేలా చేసి ఆ కోడి మొత్తం తినేవారట.

Telugu Balakrishna, Chandra Babu, Ntramarao, Senior Ntr, Tollywood-Movie

మెడిసిన్‌ వేసుకోకుండా ఇలా కోడిని తిని మొత్తం దుప్పటి కప్పుకుని పడుకునేవారట.ఫ్యాన్స్ కూడా వేసుకునేవారు కాదట.ఆ హీట్‌కి ఉదయం లేచేసరికి దుప్పటి మొత్తం తడిచిపోయేదని, దీంతో ఆయన జ్వరం మటు మాయమని తెలిపారు బాలకృష్ణ.తనకు కూడా ఎప్పుడైనా జ్వయం వస్తే ఇలానే చేయమని అక్క లోకేశ్వరి చెబుతుండేది, కానీ నా వల్ల కాదని చెబుతుండేవాడిని అన్నారు బాలయ్య.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube