వైరల్: అదిరిపోయే పల్లెటూరి ఫైట్... బిందెలతో బాదుకున్న మహిళలు!

తాగడానికి మంచినీరు కూడా దొరకని ప్రాంతాలు మన దేశంలో కోకొల్లలుగా ఉన్నాయి.నీటి కోసం కొన్ని మైళ్ళు దూరం నడిచి వెళ్లి నానా ఇబ్బందులు పడుతున్నవారు ఎంతమందో ఉన్నారు.

 Women Who Are Affected By The Village Fight That Goes Viral!, Fierce Fight ,betw-TeluguStop.com

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇలాంటి ఘటనలు మనం దేశవ్యాప్తంగా అనేకం చూస్తూ ఉన్నాం.ఇక దాదాపు పల్లెల్లో బిందెలు పట్టుకుని కుళాయిల ముందు, బావుల మీద నిల్చువడం షరా మామ్ములే.

ఈ క్రమంలోనే కొంతమంది మహిళలు నీటికోసం తగువులాడుకున్న ఘటనలు మనం చూస్తూ ఉంటాం.అలాంటి ఓ ఘటన ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక్కడ వీడియోలో నీటి కోసం ఇద్దరు మహిళలు ఏకంగా యుద్ధానికి దిగి, బిందెలతో కొట్టుకోవడం మనం చూడవచ్చు.

దాంతో ఆ ఘటనను చూసిన స్థానికుడు ఒకటి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. @gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియోని చూసి జనాలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.ఒకసారి వీడియోని గమనిస్తే, వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఇద్దరు మహిళలు నీటి కోసం కుళాయి దగ్గరకు బిందెలు పట్టుకుని వెళ్లగా ఆ ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం జరిగింది.

ఆ గొడవ తీవ్రంగా మారడంతో ఇద్దరూ బిందెలతో ఒకరి తలపై మరొకరు కొట్టుకున్నారు.దెబ్బలు తగులుతున్నా పట్టించుకోకుండా ఫైటింగ్ చేయడం ఇక్కడ కొసమెరుపు.

ఇక ఆ గొడవని చూసిన అక్కడి మహిళలు ఏదో చోద్యం చూసినట్టు చూస్తూ ఉండిపోవడం ఇక్కడ గమనించవచ్చు.మరోవైపు సదరు ఫైటింగ్‌ను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ఫన్నీ వీడియో వెలుగు చూసింది.సదరు వీడియోని ఇప్పటివరకు లక్షల మంది వీక్షించడం గమనార్హం.అంతేకాకుండా… వేల సంఖ్యలో ఆ వీడియోను లైక్ చేసి ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు మరి! కొందరు ఇది `బాహుబలి ఫైటింగ్ కాదు… అంతకు మించి!` అని కామెంట్స్ చేస్తే… మరికొంతమంది సిటీ కుర్రాళ్ళు `నీటి కోసం ఇలాంటి ఫైటింగ్‌లు జరుగుతాయని మాకు తెలియదు!` అంటూ ఆశ్చర్యంగా కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube