బ్రిట్నీస్పియర్ ఎలా పెళ్లిచేసుకుందో తెలిస్తే మీరు షాక్ తింటారు... కాపురం ఎలా?

ప్రముఖ హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ బ్రిట్నీ స్పియర్స్ ( Pop singer Britney Spears )గురించి ఈ ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.42 ఏళ్ల ఈ పాప్ క్వీన్ ఇప్పటికీ తన గానంతో సంగీత అభిమానులను అలరిస్తోంది అనడంతో ఎటువంటి అతిశయోక్తి లేదు! బ్రిట్నీ స్పియర్స్ పశ్చిమ దేశాల నుండి వచ్చిన గొప్ప పాప్ కళాకారులలో ఒకరు.ఆమెకు 8 ఏళ్లు, ఉన్నపుడే ఓ షోలో ఆమెకి ఛాన్స్ దక్కింది.అక్కడ నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.ఆమె తొలి ఆల్బమ్ ‘బేబీ వన్ మోర్ టైమ్’( Baby One More Time ) 1999లో రిలీజ్ కాగా, ఇది ప్రపంచ వ్యాప్తంగా హిట్ అయ్యి, ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఆల్బమ్ గా నిలిచింది.దాంతో ఆమెపేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది.

 If You Know How Britney Spears Got Married, You Will Be Shocked. How About Camph-TeluguStop.com
Telugu Britney, Britneyspears, Spears, Shocked Camphor-Latest News - Telugu

అంతేకాకుండా ఆమె అనేక విజయవంతమైన స్టూడియో ఆల్బమ్‌లతో సూపర్ డూపర్ హిట్స్ అందుకుంది.స్పియర్స్ ‘క్రాస్‌రోడ్స్’ అనే హాలీవుడ్ చలనచిత్రం, ‘విల్ & గ్రేస్’, ‘హౌ ఐ మెట్ యువర్ మదర్’, ‘గ్లీ’ వంటి అనేక టెలివిజన్ షోలలో ఆమె అతిధి పాత్రలు చేస్తూ అలరించింది.ఇంకా ఆమె రచనలకు కూడా అనేక అవార్డులు, ప్రశంసలను లభించాయి.ఈ క్రమంలో ఏడు ‘బిల్‌బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్’, ప్రారంభ ‘రేడియో డిస్నీ ఐకాన్ అవార్డు’, 15 ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’, ‘గ్రామీ అవార్డు’, ఆరు ‘ఎం టీవీ వీడియో మ్యూజిక్ అవార్డ్స్’తో ( M TV Video Music Awards )సహా అనేక అవార్డులు సొంతం చేసుకొని చరిత్రపుటల్లోకి ఎక్కింది.

అయితే ఆమె వైవాహిక జీవితం అనేక వివాదాలకు దారితీసింది.

Telugu Britney, Britneyspears, Spears, Shocked Camphor-Latest News - Telugu

ఇక తాజాగా ఆమె నిర్వాకానికి ప్రపంచమే నోళ్లెళ్లబెట్టింది.అవును, తనకు తానుగా వివాహం చేసుకోనున్నట్లు పోస్టు చేస్తూ అభిమానులకు షాక్ ఇచ్చింది.ఈ క్రమంలోనే పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.

విడాకులు ఇచ్చిన సంవత్సర తర్వాత తనకు తాను పెళ్లి చేసుకున్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది.కాగా బ్రిట్నీ స్పియర్స్‌ మొదటగా చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి జాసన్‌ అలెగ్జాండర్‌ను వివాహం చేసుకోగా కొద్ది రోజులకే విడిపోవడం జరిగింది.

ఆ తర్వాత ఏడాది డ్యాన్సర్‌, నటుడు అయినటువంటి కెవిన్‌ ఫెడెర్‌లైన్‌ను పెళ్లి చేసుకోగా… వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు.అయితే ఈ దాంపత్యం కూడా సజావుగా సాగలేదు.

దీంతో 2007లో విడిపోయారు.ఆ తరువాత బ్రిట్నీ.2016లో నటుడు సామ్‌ అస్గారితో డేటింగ్‌ చేసి 2022లో పెళ్లి చేసుకోగా గతేడాది విడిపోవడం జరిగింది.ఆ తరువాతే ఆమె తాజాగా తనని తాను వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించింది.

దాంతో నెటిజన్లు మరి కాపురం ఎలా? అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube