టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh master ) ఇటీవలే తుది శ్వాస విడిచిన విషయం మనందరికీ తెలిసిందే.ఎప్పుడూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే రాకేష్ మాస్టర్ ఇలా ఉన్న పలంగా ఒక్కసారిగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం బాధాకరం అని చెప్పవచ్చు.
రాకేష్ మాస్టర్ మరణం ఇప్పటికీ షాకింగ్ గానే ఉంది.ఇది ఇలా ఉంటే తాజాగా రాకేష్ మాస్టర్ శిష్యుడు శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
ఆరోగ్య సమస్యలతో అకాల మరణం చెందిన రాకేశ్ మాస్టర్ పెద్ద కర్మ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని యూసఫ్ గూడలో నిర్వహించారు.

శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్( Shekhar Master, Satya Master ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి( Y.V.S.Chowdhary ) తదితరులు పాల్గొని, రాకేశ్ మాస్టర్ చిత్రపటానికి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.రాకేశ్ మాస్టర్ గొప్ప డ్యాన్సర్.మాది 8 ఏళ్ల అనుబంధం.ఆయన డ్యాన్స్‌కు సంబంధించి మీరు యూట్యూబ్‌లో చూసింది 5 శాతమే.
ఆయన టాలెంట్ గురించి చాలామందికి తెలియదు.వ్యక్తిగతంగా నేను తొలుత ప్రభుదేవా మాస్టర్ నుంచి స్ఫూర్తి పొందాను.
హైదరాబాద్ వచ్చాక రాకేశ్ మాస్టర్‌ని అభిమానించడం ప్రారంభించాను.ఆయన నా గురువు అని చెప్పేందుకు గర్వంగా ఫీలవుతాను.
అంత అద్భుతంగా నృత్యం చేసేవారు.ప్రాక్టీస్ చేసే సమయంలో చిన్న పొరపాటు జరిగినా ఊరుకునేవారు కాదు.

ఆయన ఎలా ఉన్నా, ఎక్కడున్నా బాగుండాలని కోరుకున్నాగానీ ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు.ఆయన పెళ్లి మేమే చేశాము అప్పట్లో డ్యాన్స్ తప్ప మాకు మరో ప్రపంచం తెలియదు.ఎప్పుడూ మాస్టర్ దగ్గరే ఉండేవాళ్లం.ఇన్‌స్టిట్యూట్‌లో ఉదయం, సాయంత్రం క్లాసులు చెప్పేవాళ్లం.కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల వారు ఇష్టం వచ్చినట్టు థంబ్‌నైల్స్ పెట్టి రాసేస్తున్నారు.దాని వల్ల చాలామంది బాధపడతారు.
ఇదే కాదు ఎవరి విషయంలోనైనా వాస్తవాలు మాత్రమే రాయండి.లేదంటే రాయకండి అంటూ శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు.







