మణిపూర్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.బిష్ణుపూర్ లో రాహుల్ గాంధీ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు.
అయితే గత కొన్ని రోజులుగా మణిపూర్ లో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు రాహుల్ గాంధీని అడ్డుకున్నారని తెలుస్తోంది.పోలీసుల తీరుపై కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.అనంతరం రాహుల్ గాంధీ బిష్ణుపూర్ నుంచి ఇంఫాల్ ఎయిర్ పోర్టుకు బయలుదేరారు.
ముందస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమానికి రాహుల్ గాంధీ వెళ్లనున్నారని సమాచారం.







