విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరికి( Daggubati Purandareshwari ) రాజమండ్రి ఎంపీ స్థానాన్ని కేటాయించారు.టిడిపి, జనసేన, బిజెపి పొత్తులో భాగంగా విశాఖ ఎంపీ స్థానాన్ని( Visakha MP Seat ) బిజెపి ఆశించినా… ఆ సీటుని వదులుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు అంగీకరించలేదు.
దానికి ప్రత్యామ్నాయంగా రాజమండ్రి ఎంపీ స్థానాన్ని బిజెపికి కేటాయించారు.విశాఖ టిడిపి ఎంపీ అభ్యర్థిగా భరత్ ను ప్రకటించగా, రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురందరేశ్వరి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఇక్కడ వైసిపి తమ అభ్యర్థిగా గూడూరు శ్రీనివాస్ ను( Guduru Srinivas ) ప్రకటించింది.అయితే పురందరేశ్వరికి ఇటు బిజెపి, అటు టిడిపి నేతలు నుంచి అసలు సమస్యలు మొదలయ్యేలా కనిపిస్తోంది.
దీనికి కారణం ఏపీ బీజేపీకి అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన సోము వీర్రాజు రాజమండ్రి స్థానాన్ని ఆశించారు.అయితే వీర్రాజును పక్కనపెట్టి పురందరేసరికి బిజెపి టికెట్ కేటాయించింది.
దీంతో అసంతృప్తితో ఉన్న జీవీఎల్ ఎంతవరకు సహకరిస్తారనేది అనుమానంగానే ఉంది.
కాపు సామాజిక వర్గానికి చెందిన వీర్రాజు కు టికెట్ దక్కకపోవడంతో, ఆ సామాజిక వర్గంలో అసంతృప్తి నెలకొంది.దీంతో సోము వీర్రాజు( Somu Veerraju ) వర్గం సహకారం అంతంతమాత్రమే పురందరేశ్వరి కి ఉండేలా కనిపిస్తోంది.టిడిపి విషయానికి వస్తే .రాజమండ్రి ఎంపీ స్థానాన్ని టిడిపి నేత బొడ్డు వెంకటరమణ చౌదరి ఆశించారు.పొత్తులో భాగంగా ఈ సీటును బిజెపికి కేటాయించడంపై ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు.
ఇప్పటికే జనసేన( Janasena ) కోసం రాజానగరం అసెంబ్లీ సీటును బొడ్డు వెంకటరమణ త్యాగం చేశారు.ఎంపీ స్థానమైన దక్కుతుందని ఆశలు పెట్టుకోగా, ఈ సీటును బిజెపికి( BJP ) కేటాయించి పురందరేశ్వరుని పోటీకి దింపడంతో ఆయన ఎంతవరకు సహకరిస్తారనేది తేలాల్సి ఉంది.
అసెంబ్లీ సీటును వదులుకున్నానని, ఎంపీ సీటు వస్తుందనుకుంటే అది దక్కలేదు.పార్టీని నమ్ముకుంటే నట్టేట ముంచారని బొడ్డు తన అనుచరుల వద్ద వాపోతున్నారట.దీంతో పురందరేశ్వరి కి అటు సొంత పార్టీలోని సోము వీర్రాజు నుంచి, మిత్రపక్షంగా ఉన్న టిడిపి నుంచి ఎంతవరకు సహకారం లభిస్తుందనేది అనుమానంగానే ఉంది.రాజమండ్రి ఎంపీ స్థానాన్ని బిజెపికి కేటాయించడంపై పార్టీ సీనియర్ నేతలు బొడ్డు వెంకటరమణ చౌదరి తో పాటు, మరో కీలక నేత గన్ని కృష్ణ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఐదు స్థానాల్లో టిడిపి అభ్యర్థులు, రెండు స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.దీంతో ఇటు వీర్రాజు వర్గాన్ని, అటు బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గాన్ని సమన్వయం చేసుకుని పురందరేశ్వరి ఏ విధంగా ముందుకు వెళతారో చూడాలి.