ఓ వివాహిత ప్రియుడి మోజుకు బానిసై అడ్డుగా ఉన్న భర్తను గొడ్డలితో ఐదు ముక్కలుగా నరికి కాలువలో పడేసింది.మృతుడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ హత్య ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని( Uttar Pradesh ) పీలీభీత్ జిల్లాలో చోటు చేసుకుంది.ఈ హత్యకు సంబంధించిన వివరాలు ఏమిటో పూర్తిగా చూద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.పీలీభీత్ జిల్లాలోని గజ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే శివరాం నగర్ గ్రామంలో రాంపాల్ (55), దులారో దేవీ అనే దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరికి సోంపాల్ అనే కుమారుడు సంతానం.అయితే దులారో దేవీ( Dularo Devi ) అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడితో వివాహేతర సంబంధం( Illegal Affair ) ఏర్పరచుకుంది.
కానీ దులారో దేవీ తన ప్రియుడిని తరచూ కలుసుకోవడానికి వీలు ఉండేది కాదు.తన భర్త రాంపాల్ ను అడ్డు తొలగించుకుంటే ప్రియుడుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు జాలిగా గడపవచ్చు అని ఒక మాస్టర్ ప్లాన్ వేసింది.
సోమవారం అర్ధరాత్రి భర్త నిద్రిస్తూ ఉండగా గొడ్డలి( Axe ) తీసుకుని భర్తను ఒకే వేటుతో నరికి చంపేసింది.మృతదేహాన్ని బయట పారేసేందుకు వీలుగా భర్త శవాన్ని ఏకంగా ఐదు ముక్కలుగా నరికి వాటిని ఒక గోనే సంచిలో వేసి శివనగర్ ఆరోగ్య కేంద్రం సమీపంలో ఉండే నిగోహి బ్రాంచ్ కెనాల్ లో పడేసి చేతులు దులుపుకుంది.మంగళవారం ఉదయం నుంచి రాంపాల్( Rampal ) కనిపించకపోవడంతో కుమారుడు సోంపాల్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
పోలీసులు ఆ ప్రాంతంలో ఉండే స్థానికులతో పాటు భార్య దులారో దేవి విచారించారు.అయితే దులారో దేవీ విచారణలో కాస్త కంగారు పడడంతో పోలీసులకు అనుమానం మొదలైంది.వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా మొదట నేరం అంగీకరించలేదు.
ఇక పోలీసులు తమ స్టైల్ లో విచారణ చెయ్యగా అసలు విషయం చెప్పేసింది.పోలీసులు ఘటనా స్థలాన్ని పూర్తిగా కలిసి రక్తపు మరకలతో ఉన్న బట్టలను స్వాధీనం చేసుకున్నారు.
కెనాల్ లో గజఈతగాల సహాయంతో మృతదేహం కోసం గాలించారు.ఘటన గురువారం వెలుగులోకి వచ్చిందని స్థానిక సర్కిల్ పోలీస్ అధికారి అన్షు జైన్ తెలిపారు.