ఒక్క సినిమా విజయం సాధిస్తే చాలు తమ పేరు ముందు ఏదో ఒక స్టార్ ఇమేజ్ లేదా ట్యాగ్ యాడ్ చేసుకోవడం ఇప్పుడు వస్తున్న హీరోలకి బాగా అలవాటు.అయితే ఇలా ట్యాగ్స్( Tags ) వాడడం ఇప్పుడే కొత్త కాదు సినిమా పుట్టినప్పటి నుంచి ఎవరికి వారు ఏదో ఒక ట్యాగ్ తమకు తాముగా ఇచ్చుకొని ఇండస్ట్రీలో సెటిలైపోయిన వారే.
మెగాస్టార్ నుంచి సంపూర్ణేష్ వరకు అందరికీ ఏదో ఒక ట్యాగ్ ఉండనే ఉంటుంది.అయితే మీడియం రేంజ్ హీరో అయినప్పటికీ స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) మాత్రం ఈ విషయంలో నాకు ఎలాంటి ట్యాగ్ వద్దు ప్లీజ్ అంటున్నాడు.
మరి ఇలా ఎలాంటి ట్యాగ్ లేకుండానే విజయ్ దేవరకొండ ఆ సినిమా ఇండస్ట్రీలో ఎలా ముందుకు వెళతాడు అని ఆయన అభిమానులంతా ఫీల్ అవుతున్నారు వారే ఇప్పటికీ ముద్దుగా రౌడీ బాయ్( Rowdy Boy ) అని పిలుచుకుంటున్నారు కానీ అది అఫీషియల్ గా ఎక్కడ సినిమాలో వాడటం లేదు పైగా గత మూడు నాలుగు సినిమాల నుంచి దర్శకుడు అంతా కూడా ఏదో ఒక పేరు ఉండాలి అని చెబుతున్నా కూడా విజయ్ దేవరకొండ ఆ విషయంలో దృష్టి పెట్టడం లేదు.ఎంతమంది అభిమానులు నాకు రౌడీ బాయ్ అనే ముద్దు పేరు పెట్టారు అది చాలు నాకు ఎలాంటి ట్యాగ్ వద్దు అని కరాఖండిగా చెబుతున్నాడు.
పైగా అమ్మానాన్న పెట్టిన పేరు ఉండగా పెట్టుడు పేర్లు మాత్రం నాకెందుకు అని దోరణి కూడా ఎక్కువగా ఉంటుందట విజయ్ దేవరకొండ కి.ఇక పేరుకే విజయ్ దేవరకొండ మీడియం రేంజ్ హీరో.కానీ ఒక్క బ్లాక్ బాస్టర్ కరెక్ట్ గా పడితే అతడు టాప్ స్టార్స్ పక్కన పేరు దక్కించుకొగలడు.మరి అలాంటి టైం లో అయినా ఒక ట్యాగ్ పెట్టి దాని ఇండియా స్టార్ అవుతాడా లేదా అని వేచి చూసి తెలుసుకోవాలి.