టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీలకు( Sreeleela ) గతేడాది వరకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా వరుస ఫ్లాపుల వల్ల ఆమెకు క్రేజ్ కొంతమేర తగ్గిందనే సంగతి తెలిసిందే.అయితే హీరోయిన్ గా ఆఫర్లు తగ్గినా బ్రాండ్ అంబాసిడర్ గా మాత్రం ఈ బ్యూటీ బిజీగానే ఉన్నారు.
ప్రముఖ విద్యా సంస్థలలో శ్రీ చైతన్యకు( Sri Chaitanya ) ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.ఈ సంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ ఒక ప్రకటనలో ఈ విషయాలను వెల్లడించారు.
శ్రీలీల ఇప్పటికీ స్టూడెంట్ కాబట్టే ఈ బంపర్ ఆఫర్ ఆమెకు దక్కిందని కామెంట్లు చేస్తున్నారు.బ్రాండ్ అంబాసిడర్ గా( Brand Ambassador ) పని చేస్తున్నందుకు శ్రీలీలకు బాగానే పారితోషికం దక్కి ఉండవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
శ్రీలీల యాడ్స్ తో మళ్లీ బిజీ అవుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.శ్రీలీల కెరీర్ పరంగా కూడా భారీ ప్లాన్స్ తో రాబోయే రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

శ్రీలీల డాక్టర్ కోర్సును పూర్తి చేసిన తర్వాత హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తారో లేక డాక్టర్ గా( Doctor ) కెరీర్ ను కొనసాగిస్తారో చూడాల్సి ఉంది.శ్రీలీల నవ్వుకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.శ్రీలీల ఉస్తాద్ భగత్ సింగ్ లో( Ustaad Bhagat Singh ) మాత్రమే నటిస్తుండగా ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియాల్సి ఉంది.చిన్న వయస్సులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం శ్రీలీలకు ప్లస్ అవుతోంది.

శ్రీలీల ఇతర ఇండస్ట్రీలపై ఫోకస్ పెడతారని ప్రచారం జరిగినా ఆ ప్రచారం గురించి సైతం శ్రీలీల మాత్రం రియాక్ట్ కావడం లేదు.శ్రీలీల కథల ఎంపికపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదని నెటిజన్లు చెబుతున్నారు.శ్రీలీల నిదానంగా సినిమాలలో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది.







