కీరవాణి కి ముచ్చెమటలు పట్టించి భయపెట్టించిన ఆ సినిమా ఏంటో తెలుసా ?

కీరవాణి ప్రస్తుతం గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకొని ప్రపంచస్థాయి సంగీత దర్శకుడుగా మారిపోయాడు.కానీ అలాంటి కీరవాణి ని సైతం ఒక సినిమా భయపెట్టిందట ఆ సినిమా పేరు చెబితే చాలు రాత్రిపూట పీడకలు వచ్చేయట అంతలా భయపెట్టించిన ఆ సినిమా ఏంటి ఆ సినిమా తీసిన దర్శకుడు ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.

 Why Keeravani Scared To Work For Rathri Movie , Golden Globe Award, Keeravani, R-TeluguStop.com

క్షణం క్షణం వంటి అద్భుతమైన సినిమాకు రామ్ గోపాల్ వర్మ కోసం పనిచేసిన కీరవాణి అతడు తీసిన రాత్రి అనే సినిమా కోసం కూడా ఆర్ఆర్ వేయాలని కీరవాణి కి కబురు పెట్టాడట.ఆ సమయానికి వర్మ నెంబర్ వన్ డైరెక్టర్ పొజిషన్ కి వచ్చాడు అందుకే రాత్రి సినిమా పూర్తి చేయగలిగాడు షూటింగ్ అంతా అయిపోయింది నగరతో కూడిన శబ్దాలతో డబుల్ పాజిటివ్ రెడీ అయిన సినిమాలు చూడమని సంగీత దర్శకుడైన కీరవాణి నీ మద్రాస్ నుంచి పిలిపించారు.

Telugu Assistantsiva, Keeravaani, Keeravani, Ram Gopal Varma, Rathri, Tollywood-

ఆ సినిమా మొత్తం చూశాక అక్కడ నుంచి పారిపోయినంత పని చేశాడట అప్పటినుంచి వర్మకు కానీ ఆయన అసిస్టెంట్ శివ నాగేశ్వరరావు కి కానీ కనిపించకుండా తిరగడం మొదలు పెట్టాడట.విషయం ఏంటో చెప్పకుండానే కీరవాణి రెస్పాండ్ అవ్వడం మానేశాడట.ఓ రోజు శివ నాగేశ్వరరావు కీరవాణిని పట్టుకొని ఖచ్చితంగా టైం ఇవ్వాల్సిందే అని అడిగాడట.దాంతో అసలు విషయం చెప్పకుండా దయచేసి నన్ను వదిలేయండి అంటూ దండం పెట్టాడట.

దాంతో శివ నాగేశ్వరరావు అసలు విషయం వర్మతో చెప్పగా వర్మ చాలా హర్ట్ అయ్యాడట దాంతో రాత్రి సినిమాతో పాటు అప్పటికే తీసి పెట్టుకుంటున్న మనీ అనే కామెడీ ఓరియంటెడ్ సినిమాకి సైతం కీరవాణిని తప్పిస్తున్నట్టుగా చాలా కోపంగా చెప్పాడట వర్మ.

Telugu Assistantsiva, Keeravaani, Keeravani, Ram Gopal Varma, Rathri, Tollywood-

ఆ తర్వాత కొన్నాళ్లకు శివ నాగేశ్వరరావు ఎలాగైనా విషయం ఏంటో తెలుసుకోవాలని కీరవాణిని గట్టిగా అడిగాడట.ఇక తప్పక అసలు విషయం బయట పెట్టాడట కీరవాణి.రాత్రి సినిమాను నగారా సౌండ్ లో చూసిన తర్వాత తనకు ప్రతిరోజు రాత్రి పీడకలలు వచ్చాయట తాను ఆ సినిమాను చూసి ఎంతో భయపడ్డానని దానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేస్తే ఇక ఆ ప్రభావం తనపై ఉండి తాను పిరికివాడిగా మారిపోతానని భయం వేసిందట అందుకే ఆ సినిమా నుంచి తప్పుకోవాలని తప్పించుకొని ఉన్న విషయం బయట పెట్టాడు.

ఈ విషయం శివ నాగేశ్వరరావు వర్మతో చెప్పగా అప్పటినుంచి కీరవాణిని మరే సినిమాలోని తీసుకోలేదు వర్మ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube