మార్చ్ 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుతారంటే..?!

ప్రతి మహిళా కూడా గర్విందగ్గ రోజు ఒకటి ఉంది అంటే అది ఉమెన్స్ డే అని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.మహిళలు అన్ని రంగాల్లోను ముందుకు దూసుకుని పోతున్నారు.

 Why International Women S Day Is Celebrated On March 8 , International Women S-TeluguStop.com

సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా అన్ని రంగాల్లోను ముందజలో ఉన్నారు.మహిళ యొక్క గొప్పతనాన్ని, ఆమె చేసే సేవలను ప్రపంచంలోని అందరు గుర్తు చేసుకునే రోజే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే ఉమెన్స్ డే అనేది తొలిసారిగా 1911లో మొదలైంది.అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే దాదాపు శతాబ్ద కాలంగా మనం ఉమెన్స్ డే ను ఒక పండగ లాగా సెలబ్రేట్ చేసు కుంటున్నాము.

ఒకప్పుడు మహిళల పట్ల చాలా మంది చిన్న చూపు చూసేవారు.లింగ బేధం చూపిస్తూ మహిళలను అవమానించేవారు.

ఈ క్రమంలోనే మహిళలు తమ హక్కుల కోసం పోరాటాలు మొదలు పెట్టారు.అయితే ఈ మహిళా దినోత్సవంను కొన్ని రంగుల సమ్మేళనంతో సెలెబ్రేట్ చేస్తారు.

ముఖ్యంగా పర్పుల్, గ్రీన్, వైట్ కలర్స్ లో రిప్రజెంట్ చేస్తుంటారు.ఈ రంగులను ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యునైటెడ్ కింగ్‌డమ్ 1908లో కేటాయించింది.

అప్పట్లో మహిళలపై జరుగుతున్న వేధింపులు, అసమానత భావం పట్ల 1908లో సంస్కరణ కోసం మహిళలు అందరు ఉద్యమంలో పాల్గొని వాళ్ళ గొంతును వినిపించారు.

ఆ తరువాత 1910లో డెన్మార్క్‌ లోని కోపెన్ హాగన్ శ్రామిక మహిళల రెండో అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు.

ఈ క్రమంలోనే జర్మన్ మార్క్సిస్ట్ సిద్ధాంత కర్త అయిన క్లారా జటికిన్ ఉమెన్స్ డే ను ప్రతి ఏటా, ప్రతి దేశంలో జరుపుకోవాలని పిలుపు నిచ్చారు.అలా 17 దేశాలలోని 100 మంది మహిళలు, యూనియన్ నేతలు, సోషలిస్ట్ పార్టీలు, శ్రామిక మహిళ సంస్థలు, ఫిన్నిష్ పార్లమెంట్ కు ఎంపికైన ముగ్గురు మహిళలు ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించడం వలన అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదలయింది.

అలా ప్రతి యేటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube