హనీ రోజ్.( Honey Rose ) ఈ పేరు టాలీవుడ్ లో నిన్న మొన్నటి వరకు చాల పాపులర్ గా వినిపించింది.
ఆమె కేవలం బాలకృష్ణ వీర సింహారెడ్డి( Veerasimha Reddy ) సినిమాలో మాత్రమే కనిపించగా, ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా లో కూడా నటించడం లేదు.మొదటి నుంచి మలయాళం సినిమాల్లోనే నటిస్తున్న హనీ రోజ్ చాల లేట్ వయసులో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వచ్చింది.
ప్రస్తుతం ఆమె వయుస్సు 32.ఆమె కన్నా వయసు ఎక్కువగా ఉన్న హీరోయిన్స్ కూడా సినిమాలు చేస్తున్నారు.
కానీ అంతగా హనీ రోజ్ పైపు మేకర్స్ ఎందుకు చూడటం లేదు అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.అయితే హనీ రోజ్ యూత్ కి మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేసింది.
ఆమె మళ్లి ఏ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలరిస్తుందా అని అందరు ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం ఆమె 2023 లో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.
, అందులో ఒకటి వీర సింహ రెడ్డి చిత్రం మరొకటి పూక్కాలం సినిమా.
ఇందులో కేవలం స్పెషల్ అప్పియరెన్స్ మాత్రమే ఇచ్చింది.మలయాళంలో వచ్చిన రాణి : ది రియల్ స్టోరీ లో( Rani: The Real Story ) కూడా ఒక పాత్రలో నటించింది.అయితే 2024 లో కూడా రాచెల్,( Rachel ) తేరి మేరీ( Teri Meri ) అనే మరో రెండు ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది కానీ తెలుగు లో మాత్రం ఏ చిత్రం లో కనిపించే అవకాశం లేదు.
అందుకు కారణాలు ఏమై ఉంటాయా అని ఆరా తీస్తే అందరికి ఎంతో నచ్చే హనీ రోజ్ లావుగా ఉండటం వల్లే హాట్ హీరోయిన్ పాత్రలు ఇవ్వడానికి మేకర్స్ ముందుకు రావడం లేదు.
పోనీ ఏదైనా క్యారెక్టర్ రోల్ లో( Character Roles ) చేద్దామా అంటే ఆమె తల్లి ఇమేజ్ సూట్ కావడం లేదట.అందువల్లే ఆమె ఏ సినిమాలో కూడా నటించ లేకపోతుందట.ఇకపోతే హనీ రోజ్ ఈ వయసులో కూడా సింగిల్ గానే ఉంటుంది.
అభిమానుల ఆరాధ్య దేవత అయినా హనీ మరిన్ని తెలుగు సినిమాల్లో( Telugu Movies ) నటిస్తే చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఇది ఇలాగే కొనసాగితే ఆమె గురించి అందరు మర్చిపోవడం ఖాయం.