నాగార్జున హీరో గా త్రివిక్రమ్ కథ అందించిన సినిమా మన్మధుడు( Manmadhudu ) ఈ సినిమా కి డైరెక్టర్ విజయభాస్కర్( Vijaya Bhaskar ) అయినప్పటికీ ఆయన కంటే ఎక్కువ పేరు త్రివిక్రమ్ గారికే వచ్చింది.ఆయన రాసిన డైలాగ్స్ అలాంటివి మరి…ఈ సినిమా ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నాగార్జున నే నిర్మించాడు…ఈ సినిమా విపరీతం గా ఆడటం తో ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన నాగార్జునకి డబ్బులతో పాటు హీరోగా కూడా ఒక మంచి సక్సెస్ దక్కింది.
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే నాగార్జున( Nagarjuna ) లవ్ స్టోరీ లో హీరోయిన్ గా అన్షు అనే ఆమె చేసిన విషయం మనకు తెలిసిందే.ఇక దానికి తోడు ఆమె ఆ సినిమాలో కార్ యాక్సిడెంట్ లో చనిపోతుంది.అయితే ఆ రోల్ కి మొదట గా తెలుగు లో అప్పటికే మంచి సక్సెస్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఆర్తి అగర్వాల్ ను తీసుకుందాం అని అనుకొని ఆమె అనుకున్నారట… ఇక అప్పటికే విజయ భాస్కర్ త్రివిక్రమ్ వీళ్ళు వెంకటేష్ తో చేసిన నువ్వు నాకు నచ్చావ్( nuvvu naku nachhav ) సినిమాతోనే ఆమె ఇండస్ట్రీ కి పరిచయం అవ్వడం వల్ల వీళ్ళు వెళ్లి అడిగితే అదంత విన్న తర్వాత ఆర్తి అగర్వాల్ ఆ క్యారెక్టర్ చాలా చిన్నది దాంట్లో నేను చేయలేను కావాలంటే సోనాలి బింద్రే( Sonali Bendre ) చేసే క్యారెక్టర్ అయితే చేస్తాను అని చెప్పిందట ఇక దాంతో విజయ భాస్కర్ చేసేదేం లేక కొత్త అమ్మాయి అయిన అన్షు ని తీసుకున్నారు.
ఈమె ప్రభాస్ తో రాఘవేంద్ర( Raghavendra ) అనే సినిమాలో కూడా నటించింది ఈ సినిమాలో కూడా ఆమె చనిపోయే క్యారెక్టర్ లోనే నటించింది అయితే రాఘవేంద్ర బాక్స్ ఆఫీస్ ముందు ప్లాప్ అవ్వగా మన్మధుడు మాత్రం సూపర్ హిట్ అయింది…అయిన కూడా ఈ అమ్మాయి కి తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాకపోవడం తో ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయింది…ఇక ప్రస్తుతం నాగార్జున ప్రసన్న కుమార్ బెజవాడ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఇది కాకుండా ఇంకో కొత్త సినిమాకి కూడా కమిట్ అయినట్లుగా తెలుస్తుంది.