అప్పటి వరకు ఈ విపత్తు తప్పదు

ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్‌ నుండి బయట పడటం ఇప్పట్లో సాధ్యం కాదంటూ స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. పోయింది అనుకుంటూ ఉన్నా మళ్లీ వస్తున్న నేపథ్యంలో కరోనా నివారణ ఇప్పట్లో సాధ్యం అయ్యేలా లేదంటూ ఆ సంస్థ పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది.

 Who Announce The Key Elements Of Corona Virus And Corona Vacine, Who, Corona Vir-TeluguStop.com

కోవిడ్‌ 19కి వ్యాక్సిన్‌ తయారు అయ్యే వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందంటూ ఆవేదనతో తెలియజేశారు.ప్రస్తుతానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మినహా మరేం చేయలేమని, ప్రపంచ దేశాలన్ని ప్రస్తుతం ఈ మహమ్మారికి వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ తయారీకి తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ల సంఖ్య రెండు మిలియన్‌లకు చేరువలో ఉంది.అమెరికాలోనే ఈ సంఖ్య లక్షల్లో ఉండటం ఆందోళనకరంగా మారింది.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క దేశం కూడా తమ ప్రజలను కాపాడుకునేందుకు లాక్‌ డౌన్‌లు విధించడం తప్ప మరే మార్గం లేదంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఏ దేశాల్లో అయితే ఆలస్యంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిందో ఆ దేశాల్లో పరిస్థితి కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉందని, మిగిలిన దేశాల్లో మాత్రం పరిస్థితి చేయి దాటిపోయే పరిస్థితికి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రస్తుతం ప్రపంచ దేశాలు అన్ని కూడా ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనిపెట్టేందుకు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube