పరిస్థితులు ఎంత అనుకూలంగా ఉన్నా , ఒక్కోసారి దూకుడుగా తీసుకున్న నిర్ణయాలు రివర్స్ అయ్యే అవకాశం ఉంది .ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీలోను ఇదే జరుగుతోంది .
అన్ని పార్టీల కంటే ముందుగానే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలనే ఆలోచనతో భారీ ప్రక్షాళన ను మొదలుపెట్టారు .నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించి, వాటి ఆధారంగా మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీ లో గందరగోళంగా మారింది.కొత్త సమస్యలకు కారణం అవుతున్నాయి.నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ ఉండడంతో, ఆ ఎమ్మెల్యేలకు మద్దతు గా వారి అనుచరులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతున్నారు.మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఆలోచనలో వైసీపీ కి రాజీనామా చేసి ఇతర పార్టీలో చేరిపోతున్నారు.
మళ్లీ తమ ఎమ్మెల్యేలకే టికెట్ ఇవ్వాలని కోరుతూ ఆందోళన కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు.

ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఈ తరహా పరిస్థితి తలెత్తింది.ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు చేర్పులుకు శ్రీకారం చుట్టిన వైసీపీ , మరో 60 స్థానాల్లో మార్పు చేర్పులు చేపట్టి , ఆ జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో టికెట్ దక్కే అవకాశం లేదనుకున్న వారిని తాడేపల్లికి పిలిచి జగన్ పరిస్థితిని వివరిస్తున్నారు.
కొంతమంది జగన్ ( CM jagan )నిర్ణయానికి కట్టుబడి ఉండగా, మరికొంతమంది బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పెనుకొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకరనారాయణ ను అనంతపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం ఆదేశించింది.
కానీ శంకరనారాయణ అనుచరులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు.అలాగే కదిరి నియోజకవర్గం లో మరోసారి సిద్ధారెడ్డికి టికెట్ ఇవ్వాలని , వేరొకరికి టికెట్ ఇస్తే అంగీకరించబోమని వైసిపి కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు.

ఏకపక్షంగా సర్వేల పేరు చెప్పి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే పార్టీకి వ్యతిరేకంగా తాము పని చేయాల్సి వస్తుంది అంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ఇక పల్నాడు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి మరోసారి టికెట్ ఇవ్వద్దంటూ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ( Janga Krishna Murthy )అనుచరులు ఆందోళన చేపట్టారు.గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో జంగా కృష్ణమూర్తి వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.తాను రెండుసార్లు ఎమ్మెల్యే గా ఎమ్మెల్యేగా పనిచేశానని, ఈసారి టికెట్ తనకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు .ఈ వ్యవహారం వైసిపి అధిష్టానానికి తెలియడంతో వెంటనే ఆయనను తాడేపల్లి రావాల్సిందిగా ఆదేశించారు.దీంతో ఆయన వెంటనే తాడేపల్లి కి వెళ్ళిపోయారు .దీంతో అక్కడ ఉన్న కార్యకర్తలు రెండుగా చీలిపోయి ఒకరిపై విమర్శలు చేసుకుంటూ ఆ సమావేశాన్ని రసభస చేశారు.నరసరావుపేటలో ఇదే తరహా వ్యవహారం బయటపడింది.
వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ మరో వర్గం ఆందోళన చేపట్టింది .డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి తనకే టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. నరసారావుపేట టికెట్ మళ్లీ గోపిరెడ్డికి ఇస్తే , ఈసారి ఓటమి ఖాయమని ఆయన చెబుతున్నారు.అంతేకాదు ఈ వ్యవహారంపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
.