మెగాస్టార్ చిరంజీవి హీరోగా ముత్యాల సుబ్బయ్య ( Mutyala Subbaiah ) దర్శకత్వం వచ్చిన అన్నయ్య సినిమా అప్పట్లో పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది.ముఖ్యంగా ఇద్దరి తమ్ముళ్ల కోసం ఏదైనా చేసే అన్నయ్య క్యారెక్టర్ లో చిరంజీవి నటించడమే కాకుండా జీవించాడనే చెప్పాలి.
ఇక నిజ జీవితంలో కూడా చిరంజీవికి నాగబాబు, పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు.కాబట్టి ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ కూడా చిరంజీవి నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండటంతో ఆ క్యారెక్టర్ లో జీవించాడనే చెప్పాలి.
ఇక ఇది ఇలా ఉంటే అన్నయ్య సినిమా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చిరంజీవి తన ఫ్యామిలీ అందరికి స్పెషల్ షో వేయించి చూపించాడట.
అయితే ఆ సినిమాలో ‘ఆట కావాలా పాట కావాలా’ సాంగ్ తర్వాత సిమ్రాన్( Simran ) తో ఒక సీన్ ఉందట.అది కూడా కొంచెం ఎక్స్ పోజింగ్ తో ఉండడంతో మంచి ఫ్యామిలీ సినిమాగా ముందుకు వెళ్తున్న ఈ సినిమాలో అలాంటి ఒక ఎక్స్ పొజ్ చేసే సీన్ పెట్టడం అనేది పవన్ కళ్యాణ్ కి నచ్చలేదంట.దాంతో చిరంజీవితో మాట్లాడి ఆ సీను తీయించమని చెప్పాడంట… దానికి ముందు చిరంజీవి పవన్ కళ్యాణ్ ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ, పవన్ కళ్యాణ్ ఆ సీన్ కరెక్ట్ కాదు అన్నయ్య అని చెప్పాడట.
అయితే డైరెక్టర్ ఆ సీన్ పెట్టడానికి కారణం బి, సి సెంటర్లో అలాంటి సీన్లు ఉంటేనే జనాలు రిపిటెడ్ గా సినిమాకు వస్తారు అని పెట్టాము అని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడట… కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చిరంజీవి సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూస్తారు.ఈ సినిమా మొత్తం ఫ్యామిలీకి సంబంధించిన సినిమానే అయిన కూడా మధ్యలో ఆ ఒక్క సీను పంటికింది రాయిలా మారబోతుందని పవన్ కళ్యాణ్ చెప్పడంతో చిరంజీవి కూడా ఓకే అని ఆ సీన్ ని తీసేసి సినిమాను రిలీజ్ చేశారు.సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా ఆదరించారు.సినిమా మంచి విజయాన్ని సాధించింది…
.