తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నటుడు విజయ్( Actor Vijay )… ఆయన హీరోగా వచ్చిన చాలా సినిమాలు తమిళం లో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి.ఇక తెలుగులో కూడా ఆయన సినిమాలను డబ్ చేస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం ఆయన సినిమాలు చాలా వరకు ఫెలవుతున్నాయి.
ఇక ఇదిలా ఉంటే ఆయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో హీరోయిన్ సంఘవితో( heroine Sanghavi ) చాలా క్లోజ్ గా ఉండేవాడట.దీని మీద అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి.
ఇక వీరిద్దరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి.వీరిద్దరూ ప్రేమించుకున్నట్టుగా కూడా అప్పట్లో కోలీవుడ్ మీడియా చాలా కథనాలను కూడా రాసింది.

అలా ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి కూడా చేసుకుందామనుకున్న సమయంలో విజయ్ వాళ్ళ ఫాదర్ అయిన ఎస్ ఎ చంద్రశేఖర్( SA Chandrasekhar ) వీళ్ళ పెళ్లికి అడ్డంకి చెప్పడంతో విజయ్ సంఘవి మధ్య బ్రేకప్ అయిందట.అయిన కూడా సంఘవి మాత్రం విజయ్ ని పీకల్లోతు ప్రేమించి ఉండటంతో తననే పెళ్లి చేసుకోవాలని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ విజయ్ వాళ్ల ఫాదర్ మాత్రం విజయ్ ఆమెతో మాట్లాడకుండా కండిషన్స్ పెట్టి మొత్తానికైతే ఇద్దరిని విడదీశాడట.దాంతో ఆమెకి తమిళంలో అవకాశాలు కూడా తగ్గిపోవడంతో తెలుగు లో తాజ్ మహల్ ( Taj Mahal )సినిమాతో సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సంఘవి ఆ తర్వాత కూడా వరుసగా సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది… ఇక తెలుగులో వెంకటేష్ ,నాగార్జున, శ్రీకాంత్, జగపతిబాబు, రాజశేఖర్ లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది…ఇక ఇక్కడ కూడా హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయింది.ఇక ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రెఢీ అవుతుంది…
.







