Nayanthara : నయనతార క్షమాపణలు చెప్పింది.. కానీ ఆమె చేసిన తప్పేంటి?

అన్నపూరణి( Annapoorani ).నయనతార చేసిన ఈ సినిమా వివాదం అందరికీ తెలిసిందే.

 Nayanthara : నయనతార క్షమాపణలు చెప్పి�-TeluguStop.com

ఈ సినిమాలో కొన్ని అభ్యంతరకరమైన విషయాలపై హిందూ విశ్వ పరిషత్ కేసు నమోదు చేయడంతో చిలికిచిలికి గాలి వానగా మారి ప్రస్తుతం నయనతార క్షమాపణలు చెప్పేంత వరకు వెళ్ళింది.సరే.విషయం ఏదో తప్పు జరిగింది అందుకు క్షమాపణ నయనతార చెప్పడం కూడా జరిగింది ఈ విషయాలను కాసేపు పక్కన పెడితే సినిమా కథ విన్నప్పుడు లేదా తీసినప్పుడు నటీనటులకు కానీ తీసిన దర్శకుడికి కానీ డబ్బులు పోసిన నిర్మాతలకు కానీ ఎలాంటి సొయి లేకపోలేదు.ఇప్పుడు బాబు ఎలాగోలా క్షమాపణలు చెప్పేస్తాం అందరూ మూసుకొని ఉండండి అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే సరిపోతుందా అంటే… అస్సలు కాదు.

Telugu Annapoorani, Hinduvishwa, Kollywood, Nayanthara, Netflix, Tollywood-Movie

ఇందులో ఎంతో కొంత నయనతార( Nayanthara ) తప్పు తక్కువే ఉంది తీసిన నిర్మాతలు తెరకెక్కిన దర్శకుడు ఎందుకు పూర్తి బాధ్యత వహించాలి జి స్టూడియోస్ ఇంతవరకు ఎన్నో సినిమాలు తీసిన అనుభవం ఉన్నవారే ఇలాంటి ఒక సినిమా తీసేముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వారిపైనే ఉంటుంది.నెట్ ఫ్లిక్స్ లో అప్లోడ్ చేసిన తర్వాత ఈ వివాదం మరింత పెరిగింది.అయితే తన తప్పు ఏమీ లేకపోయినా నయనతార ఎందుకు క్షమాపణ చెప్పింది అంటే తన పై సోషల్ మీడియాలో భారీగా వస్తున్న ట్రోలింగ్ చూసి ఆమె భయపడింది.

Telugu Annapoorani, Hinduvishwa, Kollywood, Nayanthara, Netflix, Tollywood-Movie

పైగా తన భవిష్యత్తులో తీసిన ప్రతి సినిమాపై ఓటిటి( OTT ) లు ఇలాగే స్కాన్ చేసి ఎలాంటి ఇబ్బందులు లేవు అని తెలిస్తే తప్ప అప్లోడ్ చేయరు కాబట్టి ఆమె ముందుగానే జాగ్రత్త పడి క్షమాపణ పత్రాన్ని పెట్టింది.ఒక సినిమా విషయంలో హీరోయిన్ తప్పు ఎంత వరకు ఉంటుంది చెప్పండి.

Telugu Annapoorani, Hinduvishwa, Kollywood, Nayanthara, Netflix, Tollywood-Movie

ఏదైనా సరే సెన్సార్ వారు ఎలాంటి ఇబ్బందులు లేవు అని ఒక్కసారి స్టాంప్ వేసిన తర్వాత సోషల్ మీడియా కూడా మరో సెన్సార్ లాగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అనేది కొంతమంది వాదన.అయితే ఎవరు ఏమన్నా కాదన్నా సోషల్ మీడియా అనేది చాలామంది చేతిలో ఉన్న ఒక అస్త్రం.దాన్ని ఎలాగైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా వాడొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube