డస్ట్ ఎలర్జీ, సి ఫుడ్ ఎలర్జీ గురించి విన్నాం కాని ఈ వీర్యం ఎలర్జీ అంటే ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.వీర్యం ఎలర్జీ కూడా ఉంటుంది.
దీన్ని ఆంగ్లంలో సెమెన్ ఎలర్జీ అని అంటారు.సైన్స్ భాషలో చెప్పాలంటే Human Seminal Plasma Hypersensitivity.
ఈ సమస్య చాలామంది మహిళలకు ఉంటుంది.అలాగని వీరికి గర్భం దాల్చడం కష్టమవుతుందేమో అని మీరు అనుమానపడితే అది పొరపాటే.
ఎందుకంటే ఈ ఎలర్జీ ఉన్నవారు వీర్యం వలన చర్మ సమస్యలతో బాధపడవచ్చు.
ఈ ఎలర్జీ ఉన్న మహిళల ఒంటి మీద, ముఖ్యంగా జననాంగాల దగ్గర వీర్యం పడితే, దురద, మంట ఆ ప్రదేశంలో మొదలు కావచ్చు.
వీర్యంలో ఉన్న ప్రోటీన్స్ స్త్రీ చర్మానికి మధ్య పడక ఇలా జరగవచ్చు.ఇది అందరికి ఉండే సమస్య కాదు.చర్మం వీర్యానికి బాగా సెన్సిటివ్ గా ఉండటం వలనే దీన్ని Human Seminal Plasma Hypersensitivity అని అంటారు.
ఈ సమస్య ఉన్నట్లు గ్రహిస్తే వెంటనే ఓ డాక్టర్ ని కలవాలి.
బయటకి ఎక్కువగా తెలియని చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ఈ సమస్యకి.కాబట్టి ఓ సేక్సాలాజిస్టుని, ఆ తరువాత ఓ డెర్మటాలాజిస్టుని కలిస్తే మంచిది.