వీర్యం ఎలర్జీ అంటే ఏమిటి ?

డస్ట్ ఎలర్జీ, సి ఫుడ్ ఎలర్జీ గురించి విన్నాం కాని ఈ వీర్యం ఎలర్జీ అంటే ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.

వీర్యం ఎలర్జీ కూడా ఉంటుంది.దీన్ని ఆంగ్లంలో సెమెన్ ఎలర్జీ అని అంటారు.

సైన్స్ భాషలో చెప్పాలంటే Human Seminal Plasma Hypersensitivity.ఈ సమస్య చాలామంది మహిళలకు ఉంటుంది.

అలాగని వీరికి గర్భం దాల్చడం కష్టమవుతుందేమో అని మీరు అనుమానపడితే అది పొరపాటే.

ఎందుకంటే ఈ ఎలర్జీ ఉన్నవారు వీర్యం వలన చర్మ సమస్యలతో బాధపడవచ్చు.ఈ ఎలర్జీ ఉన్న మహిళల ఒంటి మీద, ముఖ్యంగా జననాంగాల దగ్గర వీర్యం పడితే, దురద, మంట ఆ ప్రదేశంలో మొదలు కావచ్చు.

వీర్యంలో ఉన్న ప్రోటీన్స్ స్త్రీ చర్మానికి మధ్య పడక ఇలా జరగవచ్చు.ఇది అందరికి ఉండే సమస్య కాదు.

చర్మం వీర్యానికి బాగా సెన్సిటివ్ గా ఉండటం వలనే దీన్ని Human Seminal Plasma Hypersensitivity అని అంటారు.

ఈ సమస్య ఉన్నట్లు గ్రహిస్తే వెంటనే ఓ డాక్టర్ ని కలవాలి.బయటకి ఎక్కువగా తెలియని చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ఈ సమస్యకి.

కాబట్టి ఓ సేక్సాలాజిస్టుని, ఆ తరువాత ఓ డెర్మటాలాజిస్టుని కలిస్తే మంచిది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి14, మంగళవారం2025