అక్కినేని నటవారసుడు నాగచైతన్య వరుసగా సినిమాలను ఓకే చేస్తు్న్నాడు.కొంచెం కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేయడానికి సామ్‌తో విడాకులు తీసుకోవడమే కారణమని అందరూ అనుకుంటున్నారు.
సమంతతో గడిపిన మెమోరీస్ గుర్తుకు రావొద్దనే వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడపాలని చైతూ నిర్ణయించుకున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.అందుకోసమే హిట్స్, ప్లాపులతో సంబంధం లేకండా వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నాడని తెలిసింది.
రీసెంట్‌గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా థియేటర్ల ముందుకు వచ్చింది.అయితే, అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది.
అయితే, ఇకముందు వచ్చే సినిమాలపై చైతూ అభిమానులు కొంత ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది.
కారణం ఎంటంటే.
నాగచైతన్య ఒకే దర్శకుడితో రెండుకు మించి సినిమాలు ఎప్పుడూ చేయలేదు.తన కెరీర్ ప్రారంభంలో తొలి విజయాన్ని అందించిన గౌతమ్ మీనన్‌తో.2010లో ఏమాయ చేసావే తర్వాత.2016లో సాహసం శ్వాసగా సాగిపో చేశాడు చైతూ.ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.అలాగే 2016లో ప్రేమమ్ వంటి క్లాసిక్ ఎంటర్ టైనర్‌ను అందించిన దర్శకుడు చందు మొండేటితో .2018లో సవ్యసాచి మూవీ చేశాడు.అటు గౌతమ్ మీనన్, ఇటు చందు మొండేటితో రెండోసారి చేసిన సినిమాలు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు.
ఇకపోతే.ప్రస్తుతం చైతూ చేస్తున్న సినిమాలు కూడా ఆయా డైరెక్టర్లకు రెండో సారి అవకాశం ఇవ్వడమే.2014లో మనం వంటి క్లాసిక్ హిట్ తర్వాత విక్రమ్ కె.కుమార్‌తో కలిసి థాంక్ యూ మూవీ చేస్తున్నాడు నాగచైతన్య.అదేవిధంగా 2017లో రారండోయ్ వేడుక చూద్దాం వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో బంగార్రాజు మూవీలో నటిస్తున్నాడు.కాగా, గౌతమ్ మీనన్ , చందు మొండేటితో రెండోసారి చేసిన సినిమాలు చైతూకు పెద్దగా కలిసి రాలేదు.
అయితే, ప్రస్తుతం విక్రమ్ కె కుమార్, కళ్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలు అయినా చైతూకు విజయాన్ని అందిస్తాయో లేదో తెలియాలంటే మరికొంతకాలం ఎదురుచూడాల్సిందే.