గత కొంతకాలంగా ఏపీ అధికార పార్టీ వైసీపీ( YCP ) టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న బిజెపి ఈ మధ్యకాలంలో మరింత దూకుడు పెంచింది.ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపైనా, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పైన విమర్శలు చేస్తూ వస్తున్న బిజెపి, కేంద్ర పథకాలను ఏపీ ప్రభుత్వం తమ పథకాలుగా చేపుకుంటూ ప్రచారం చేయడంపైనే అనేక విమర్శలు చేస్తుంది.
తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ సీఎం జగన్( cm jagan ) కు లేక రాశారు.ఈ లేఖలు అనేక అంశాలను ప్రస్తావించారు.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం ను రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడం తప్పు అంటూ వీర్రాజు లేఖలో ప్రస్తావించారు.
ఈ తరహా ప్రచారాన్ని వైసిపి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వీర్రాజు డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా బియ్యం ఇస్తున్నట్లు ఇంటింటికి వస్తున్న రేషన్ బియ్యం వాహనాలపై ప్రత్యేక స్టిక్కర్లు అంటించాలని జగన్ కు రాసిన లేఖలో వీర్రాజు( Somu veerraju ) డిమాండ్ చేశారు.కేంద్రం నిధులు ఇస్తుంటే, ఏపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వాడుకుంటూ, కనీసం కేంద్రం పేరును ప్రస్తావించకుండా, తామే ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని గత కొంతకాలంగా బీజేపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే వీర్రాజు స్టిక్కర్ల వ్యవహారం పై జగన్ కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బిజెపి స్పీడ్ పెంచింది.
తమతో పొత్తులో ఉన్న జనసేన ద్వారా ఏపీలో బిజెపి( AP BJP )ని బలోపేతం చేసి , వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉంది.అయితే ఏపీలో వైసిపి ప్రభుత్వానికి బిజెపి అన్ని విధాలుగా సహకారం అందిస్తోందనే అభిప్రాయం ప్రజల్లో ఉండడం, బిజెపి వైసిపి ఒక్కటే అన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొనడంతో, ఆ ముద్ర నుంచి బయట పడేందుకు గత కొంతకాలంగా బిజెపి ప్రయత్నాలు చేస్తూనే వైసీపీని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తోంది.