ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు నటి రుక్సర్ రెహమాన్( Actress Ruksar Rahman ).గత రెండు మూడు రోజులుగా ఈమె పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది.
అందుకు గల కారణం కూడా లేదు రుక్సర్ రెహమాన్, దర్శకనిర్మాత ఫరూఖ్ కబీర్( Farooq Kabir ) దంపతులు విడిపోతున్నారంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.గత కొంతకాలంగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని అలా గొడవల కారణంగా ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు తారాస్థాయికి చేరడంతో విడిపోవడమే నయం అని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలపై నటి రుక్సర్ రెహమాన్ స్పందించింది.విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.అవును.మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాము.అందుకే గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నాము.
ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి మేము విడివిడిగానే జీవిస్తున్నాము.ఇద్దరి అంగీకారం మేరకు ఒక నిర్ణయం తీసుకొని విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నాము.
ఇదంత సులువుగా తీసుకున్న నిర్ణయం కాదు.దీని వెనక ఉన్న కారణాలను, వివరాలను కూపీ లాగి పెంట చేయాలనుకోవడం లేదు.
ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను అని చెప్పుకొచ్చింది రుక్సర్ రెహమాన్.కాగా నటి రెహమాన్ మొదట అసద్ అహ్మద్‌ను( Asad Ahmed ) పెళ్లాడిన్ విషయం తెలిసిందే.వీరికి ఐషా అహ్మద్ అనే కూతురు జన్మించింది.ఈమె కూడా నటిగా స్క్రీన్‌పై తళుక్కుమని మెరిసింది.అయితే రెహమాన్, అసద్‌ల మధ్య దూరం పెరగడంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత రెహమాన్ ఫరూఖ్ కబీర్ ప్రేమలో పడింది.
ఆరేళ్లు డేటింగ్‌లో ఉన్న తర్వాత 2010లో పెళ్లి చేసుకున్నారు.