అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటున్న 'బ్రో' టీజర్.. ఎన్ని మిలియన్స్ క్రాస్ చేసిందంటే?

మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన ‘బ్రో’( bro ) టీజర్ నిన్న సాయంత్రం రిలీజ్ అయిన విషయం తెలిసిందే.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో”.

 Solid Response For Bro Teaser, Bro Teaser, Bro, Vinodhaya Sitham, Pawan Kalyan,-TeluguStop.com

మెగా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి నిన్న టీజర్ రిలీజ్ అయ్యింది.అదిరిపోయే అంచనాలతో రిలీజ్ అవ్వగా ఆ అంచనాలను ఈ టీజర్ అందుకుంది అనే చెప్పాలి.

మరో నెల రోజుల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.దీంతో మేకర్స్ కూడా వరుస ప్రమోషన్స్ చేస్తున్నారు.ఈ ప్రమోషన్స్ లో భాగంగానే టీజర్ రిలీజ్ చేసారు.ఈ టీజర్ ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండగా అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టే అని అంటున్నారు.పవన్ క్రేజ్ తో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం.

ఇక ఈ టీజర్ 24 గంటలు కూడా గడవక ముందే అప్పుడే 10 మిలియన్ వ్యూస్ అందుకుని కోటి మార్క్ ను దాటేయడంతో బ్రో కి రెస్పాన్స్ అదిరింది అనే చెప్పాలి.ఇక నటుడు సముద్రఖని తెరకెక్కించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటించారు.ఈయన పాత్ర జస్ట్ అరగంట పాటు ఉంటుందని అంటున్నారు.ఆ కొద్దీ సమయం కోసం అయిన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఇక ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.ఇక ఈ సినిమా జులై 28న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.చూడాలి ఈ రీమేక్ మూవీ ఇక్కడ ఎలా ఆకట్టు కుంటుందో.

https://youtu.be/YpRinf33fBE
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube