కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై ఉత్కంఠ

కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.కేబినెట్ విస్తరణలో తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు సమాచారం.

 Excitement Over Union Cabinet Reshuffle-TeluguStop.com

అదేవిధంగా మంత్రివర్గంలో ఓబీసీలకు మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ మేరకు కీలక నాయకుల ప్రోగ్రెస్ రిపోర్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిశీలించారు.

కాగా ప్రస్తుత మంత్రివర్గం నుంచి 10 నుంచి 15 మందికి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి మినహా ముగ్గురిలో ఎవరిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలనే అంశంపై కసరత్తు పూర్తి అయిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సోమవారం కేంద్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది.మరోవైపు మంత్రివర్గం నుంచి తొలగించిన వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పనున్నారు.

పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ మార్పులు చేసేందుకు బీజేపీ హైకమాండ్ ఇప్పటికే అందుకు కావాల్సిన కసరత్తును పూర్తి చేసింది.తెలంగాణకు కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ కు నరేంద్ర సింగ్, రాజస్థాన్ కు గజేంద్ర సింగ్ తో పాటు ఒడిశాకు ధర్మేంద్రప్రదాన్ ను అధ్యక్షులుగా పంపే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube